Arekapudi Gandhi: తెలంగాణ రాష్ట్రంలో.. రౌడీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులతో వచ్చి దాడి చేయడం జరిగింది. గులాబీ పార్టీకి చెందిన నాయకున్ని అని చెప్పిన గాంధీ ఇంటికి వెళ్లి కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి ప్రకటించడం జరిగింది. Arekapudi Gandhi

Arekapudi Gandhi vs kaushik reddy war

అయితే కౌశిక్ రెడ్డి చెప్పినట్లుగా గాంధీ ఇంటికి వెళ్లకపోవడంతో.. స్వయంగా గాంధీనే… రౌడీలు అలాగే తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. గేటెడ్ కమ్యూనిటీ గేటు బద్దలు కొట్టి మరి.. గాంధీ రౌడీయిజం చేశారు. కోడిగుడ్లు అలాగే, రాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేశారు గాంధీ అనుచరులు. అనంతరం గాంధీని అరెస్టు చేశారు. వెంటనే గులాబీ నేతలు అక్కడికి చేరుకొని కౌశిక్ రెడ్డిని పరామర్శించి… సైబరాబాద్ కమిషనరేట్ కు వెళ్లారు. గాంధీతోపాటు ఆయన అనుచరులపై.. కేసులు పెట్టారు. కానీ.. వాళ్లని మాత్రం అరెస్టు చేయలేదు పోలీసులు. Arekapudi Gandhi

Also Read: Kolikapudi: జగన్ దంపతులపై సంచలన వ్యాఖ్యలు..వారిద్దరూ భార్య,భర్తలు కాదంటూ ?

అయితే ఈ దాడి అంతా.. రేవంత్ రెడ్డి వెనుక ఉండి నడిపించాడని గులాబీ నేతలు. పోలీసుల అండదండలతో గాంధీ.. రెచ్చిపోయారని.. అందుకే కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేశాడని గులాబీ నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలోనే అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ లోనే.. హరీష్ రావు బృందం ఉంది. దీంతో వాళ్లందర్నీ కూడా పోలీసులు అరెస్టు చేశారు. Arekapudi Gandhi