Star heroine who is obsessed with Dhanush

Dhanush: ధనుష్ అంటే చాలామంది అమ్మాయిలకు క్రష్ ఉంటుంది. అయితే ఈయన చూడ్డానికి అంతా అట్రాక్టివ్ గా కూడా ఉండరు.. సన్నటి శరీరంతో సిక్స్ ప్యాక్ కూడా ఉండవు..కానీ చాలామంది అమ్మాయిలు ఈయన్ని ఇష్టపడతారు. ఈయన కటౌట్ ని చూసి కాదు నటనని చూసి ఇష్టపడే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు.. ఇక మామూలు జనాలే కాదు హీరోయిన్స్ కూడా ధనుష్ యాక్టింగ్ కి ఫిదా అవుతారు. అయితే అలాంటి ధనుష్ పై ఓ కుర్ర హీరొయిన్ మోజు పడుతుందట.

Star heroine who is obsessed with Dhanush

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు..ఒకే ఒక్క సన్నివేశంతో సౌత్ లో ఫేమస్ అయిపోయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్..ఈమె తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వారు ఓరు ఆదార్ లవ్ సినిమాతో స్టార్ స్టేటస్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమా తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదలైంది.అయితే ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకే ఒక్క సీన్ తో హైలైట్ అయింది.(Dhanush)

Also Read: Producer: ఆర్టిస్ట్ తో అక్రమ సంబంధం.. తల్లిని చేసి వదిలేసిన నిర్మాత.. త్వరలోనే అరెస్ట్..?

కన్ను కొట్టి చేతివేళ్లను గన్ గా మార్చి షూట్ చేసినట్టు చేసే సన్నివేశం చాలా వైరల్ అవ్వడంతో ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియా లో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఈ ఒకే ఒక్క సన్నివేశంతో ప్రియా కి వరుస అవకాశాలు వచ్చాయి. అలా తెలుగులో కూడా ప్రియా ప్రకాష్ వారియర్ బ్రో మూవీలో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కి కోలీవుడ్ హీరో ధనుష్ అంటే చెప్పలేనంత ఇష్టమట.

Star heroine who is obsessed with Dhanush

అయితే ఈమె తరచూ ధనుష్ ఫోటోలు పోస్ట్ చేయడంతో ఎందుకు మీకు ధనుష్ అంటే అంత ఇష్టం అంటే..నాకు ధనుష్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఒక్క సినిమాలోనైనా నటించాలి అనే కోరిక నాకు ఉంది.అయితే ఆ కోరిక తీరుతుందో లేదో అంటూ ఆ ఇంటర్వ్యూలో ప్రియా చెప్పుకొచ్చింది . మరి ప్రియా ప్రకాష్ వారియర్ కోరిక తెలుసుకొని ధనుష్ తన సినిమాలో అవకాశం ఇస్తారో చూడాలి.(Dhanush)