Meena insulting that star hero

Meena: స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న మీనా కి నిజంగానే పొగరు తలకెక్కిందా.. ఎందుకు అంత అహంకారంతో ఆమె ప్రవర్తిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. మీనా కి పొగరు నెత్తికెక్కడం ఏంటి అని చాలామంది ఈ విషయం తెలిసిన వాళ్ళు ఆలోచనలో పడతారు. అయితే మీనా అహంకారంగా పొగరుగా ప్రవర్తించింది ఇప్పుడైతే కాదు. ఇప్పుడైతే ఎంతో వినయంగా అమాయకంగా కనిపించే మీనా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా అలాగే ఉండేది.

Meena insulting that star hero

కానీ ఓ హీరో వద్ద మాత్రం ఆమె కాస్త పొగరు చూపించిందట. ఇక ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా.. ఆయన ఎవరో కాదు ది లెజెండరీ యాక్టర్ దివంగత నటుడు అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు.. అయితే అక్కినేని నాగేశ్వరరావుని మీనా అవమానించడానికి కారణం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీతారామయ్యగారి మనవరాలు షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు మీనా ఏఎన్ఆర్ అటుగా వచ్చినా కూడా లేచి నిల్చోకుండా కుర్చీలోనే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తన పని తాను చేసుకునేదట.(Meena)

Also Read: Meena: విడాకులైన హీరోని రెండో పెళ్లి చేసుకోబోతున్న మీనా.. థాంక్యూ సో మచ్ అంటూ..?

అయితే ఈమె ప్రవర్తన చాలాసార్లు గమనించిన ఏఎన్ఆర్ ఒకరోజు పక్కకు పిలిచి మరి హేయ్ అమ్మాయి నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావ్..కనీసం పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వాలని కూడా తెలియదా.. నువ్వు ఇప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్నావ్.. కాబట్టి నీకు ఇవన్నీ తెలియదు కావచ్చు.

Meena insulting that star hero

కానీ సినిమాల్లో రాణించాలంటే కేవలం నటన, అందం మాత్రమే కాదు పెద్దవారికి ఎలా గౌరవం ఇవ్వాలో కూడా ముందుగా నేర్చుకో అంటూ ఫైర్ అయ్యారట.అయితే ఏఎన్ఆర్ మాటలకు ముందుగా కాస్త నొచ్చుకున్న మీనా ఆ తర్వాత ఆయన ఎంత పెద్ద నటుడో తెలుసుకొని క్షమాపణలు చెప్పిందట. ఇక ఆ తర్వాత ఏఎన్ఆర్ ఎప్పుడు కనిపించినా కూడా లేచి నిల్చోవడమే కాకుండా ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకునేదట.(Meena)