Akhil: అఖిల్ శ్రియా భూపాల్ ని ప్రేమించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.అయితే అనూహ్యంగా ఈయన పెళ్లి చెడిపోయింది. శ్రియా భూపాల్ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది.కానీ అఖిల్ మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉంటూ సినిమాల్లో రాణిస్తున్నారు.ఇక అఖిల్ పర్సనల్ కెరియర్ అలా ఉంటే సినీ కెరియర్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలు అన్ని ప్లాఫే.
who is the reason why Akhil beloved girl got away from him
దాంతో ఒక పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ హీరో ఎందుకు ఇలా ఫ్లాప్ సినిమాలు ఎంచుకుంటున్నారు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ఈ విషయం పక్కన పెడితే.. అక్కినేని అఖిల్ శ్రియా భూపాల్ తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న సమయంలో కొన్ని గొడవలు,రూమర్లు తెర మీద వినిపించాయి. ఇక ఈ రూమర్లలో వినిపించిన క్రేజీ రూమర్ ఏంటంటే..(Akhil)
Also Read: Director: ఆ డైరెక్టర్ చేతిలో తన్నులు తింటే హీరోయిన్ల రేంజ్ మారుతుందా.?
అల్లు శిరీష్ కారణంగా అఖిల్ పెళ్లి చెడిపోయిందనే వార్త.అయితే ఈ రూమర్ ఎందుకు వినిపించింది అనే దానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే అఖిల్ పెళ్లి చేసుకోబోయే శ్రియ భూపాల్ అల్లు శిరిష్ తో పార్టీ చేసుకున్న కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో అఖిల్ పెళ్లి చెడిపోవడానికి కారణం
అల్లు శిరీష్ తో శ్రీయ భూపాల్ కి ఉన్న రిలేషనే అని వినిపించింది. అయితే ఇది రూమర్ మాత్రమే. ఎందుకంటే శ్రియ భూపాల్ అల్లు శిరీష్ ఇద్దరు ఫ్రెండ్స్ కావడంతో వీళ్ళు పార్టీలో పాల్గొన్నారు. కానీ ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో కొంతమంది నెటిజన్స్ మాత్రం అఖిల్ పెళ్లి అల్లు శిరీషే చెడగొట్టారు అని పుకార్లు పుట్టించారు.(Akhil)