J.D.Chakravarthy sensational comments on Chiranjeevi

J.D.Chakravarthy: జె.డి చక్రవర్తి అంటే సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఈయన బొంబాయి ప్రియుడు, గులాబీ, ప్రేమకు వేళాయరా వంటి సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోతారు అనుకున్నారు. ఎందుకంటే ఈయన నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. కానీ అందరూ అనుకున్న ఆలోచనలకు భిన్నంగా ఈయన ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిపోయారు. ఆ తర్వాత విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

J.D.Chakravarthy sensational comments on Chiranjeevi

ఇక అలాంటి జెడి చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరో చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన ఓ పెద్ద రాక్షసుడు అంటూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట దుమారం సృష్టిస్తున్నాయి. మరి ఎందుకు జెడి చక్రవర్తి చిరంజీవిని అలా అన్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. చిరంజీవిని రాక్షసుడు, దుర్మార్గుడు అని.జెడి చక్రవర్తి అనడం ఆయన అభిమానులకు నచ్చకపోయినప్పటికీ ఈ వీడియో చూస్తే మాత్రం అలా అనరు. ఎందుకంటే జెడి చక్రవర్తి చిరంజీవిని నెగిటివ్ గా అలా అనలేదు.(J.D.Chakravarthy)

Also Read: Akhil: అఖిల్ కి ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడానికి కారణం ఆ హీరో నేనా..?

ఆయన పెద్ద పని రాక్షసుడు అని పని విషయంలో చాలా డెడికేషన్ గా వ్యవహరిస్తారని చెప్పారు. అయితే ఘరానా మొగుడు సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఆ పక్కనే సెట్లో ఈయన కూడా అంతం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట. ఆ టైంలో జెడి చక్రవర్తి చిరంజీవిని గమనిస్తూ ఉండేవారట. అయితే ఎంతమంది రెస్ట్ తీసుకొని షిఫ్టులు మారినా కూడా ఈయన మాత్రం అలాగే తన పని తాను చేస్తూనే ఉండేవారట.

J.D.Chakravarthy sensational comments on Chiranjeevi

అంతేకాకుండా ఓ రోజు అంబాసిడర్ కార్ లోనే చిరంజీవి నిద్రపోవడం చూసి ఆయన ఆగబట్టుకోలేఎందుకండీ ఇలా పడుకున్నారు రూమ్లో పడుకోవచ్చు కదా అని అడిగారట.దానికి చిరంజీవి నేను ఇక్కడ పడుకుంటే నన్ను లేపుతారు. కానీ రూమ్లో పడుకుంటే లేపరు నా వల్ల షూట్ డిస్టర్బ్ అవుతుంది.అందుకే ఇక్కడే పడుకున్నాను అని చెప్పారట. ఇక చిరు మాటలకి షాక్ అయిపోయిన జెడి చక్రవర్తి వామ్మో ఏంటి ఇంత దుర్మార్గుడులా ఉన్నాడు.మరి ఇంత పని రాక్షసుడా అని లోవలోపల అనుకున్నారట. అయితే ఇదే విషయాన్ని జెడి చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(J.D.Chakravarthy)