The star comedian who missed Mathu Vadalara-2 movie

Mathu Vadalara-2: రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహ, ఫరీయా అబ్దుల్లా హీరో హీరోయిన్స్ గా మరొక కీలక పాత్రలో కమెడియన్ సత్యలు నటించిన మత్తు వదలరా -2 మూవీ సెప్టెంబర్ 13న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దిశ గా ఈ మూవీ పరుగులు పెడుతోంది. అయితే అలాంటి ఈ సినిమా 2019లో వచ్చిన మత్తు వదలరా మూవీకి సీక్వెల్ గా వచ్చింది. ఇక మత్తు వదలరా -2 మూవీకి ఇప్పటికే ప్రభాస్, రాజమౌళి ప్రమోషన్స్ చేయడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

The star comedian who missed Mathu Vadalara-2 movie

అయితే 2019లో విడుదలైన మత్తు వదలరా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మత్తు వదలరా -2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ భావించారు. అలా ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది..దాంతో ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పడుతున్నాయి. అయితే ఈ సినిమాలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా తర్వాత మెయిన్ రోల్ లో నటించిన కమెడియన్ సత్య కంటే ముందు ఈ కామెడీ రోల్ లో మరో నటుడిని తీసుకోవాలి అనుకున్నారట డైరెక్టర్ రితేష్ రానా. (Mathu Vadalara-2)

Also Read: Jani Master: జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..ఆ కొరియోగ్రాఫర్ పై అన్నిసార్లు అత్యాచారం.?

ఇక ఆ కమెడియన్ ఎవరో కాదు ఒకప్పుడు ఢీ,దొంగల బండి, రెడీ వంటి సినిమాల్లో కమెడియన్ గా చేసిన మాస్టర్ భరత్. ఒకప్పుడు భరత్ చేసిన కామెడీ చాలా మందిని ఆకట్టుకోవడంతో పెద్దయ్యక కూడా కొన్ని సినిమాల్లో కామెడీ రోల్స్ లో చేసే అవకాశం వచ్చింది.ఇక ఈయనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది రెడీ సినిమా.. అయితే అలాంటి భరత్ ని మత్తు వదలరా టు మూవీలో సత్యపాత్రలో తీసుకోవాలి అనుకున్నారట.

The star comedian who missed Mathu Vadalara-2 movie

కానీ ఎందుకో అది కుదరలేదు.ఆ పాత్రలో సత్యని తీసుకున్నారు.ఇక మత్తు వదలరా -2 లో సత్య పాత్రకి ఇండస్ట్రీలో ఎంత ఇమేజ్ క్రియేట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో సత్య క్రేజ్ ఎక్కడికో పెరిగిపోయింది. ఒకవేళ ఈ పాత్రలో భరత్ చేసి ఉంటే గనుక ఆయనకు స్టార్ కమెడియన్ గా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టేవి అంటున్నారు కొంతమంది నెటీజెన్స్.(Mathu Vadalara-2)