Jani Master: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం రోజు రోజుకి చర్చనీయాంశం అవుతున్న విషయం తెలిసిందే. అయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని కేసు నమోదు చేయగా ఈ విషయం బయటకు వచ్చిన దగ్గరినుండి టాలీవుడ్ లో జ్వాలలు రగులుతున్నాయి.అయితే ఇందులో రాజకీయ కోణాలున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఓ సాధారణ డాన్సర్ గా జీవితాన్ని ప్రారంభించి టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ ఎందరికో స్ఫూర్తిదాయకం.

Top Hero Allegedly Behind Jani Master Harassment Case

అలాంటి వ్యక్తి ఈవిధంగా చేశాడని ఆరోపణలు రావడం నిజంగా అయన అభిమానులకు చేదు వార్తే. అయితే అయన సినిమా ఇండస్ట్రీ లో ఉన్నంతవరకు ఎలాంటి మచ్చ రాలేదు. కానీ ఎప్పుడైతే రాజకీయంగా ఎదుగుతున్నారో ఆయనపై ఒక్కో విమర్శ వస్తుంది. అలా ఇప్పుడు ఈ లైంగిక వేధింపుల కేసు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లో జానీ మాస్టర్ కీలకంగా ఎదుగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా వస్తుందని ఆశించారు. కానీ జనసేన కే తక్కువ సీట్స్ రావడంతో జానీ కి టికెట్ దక్కలేదు.

Also Read: Virat Kohli: కోహ్లీ తఢాకా.. బ‌ద్ధ‌లైన చెపాక్ స్టేడియం గోడ !!

ఏదేమైనా రాజకీయ పరమైన కక్ష్యల్లో భాగంగానే జానీ పై ఈ కేసు నమోదయ్యిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ లోని ఓ టాప్ హీరో ఈ విధంగా స్కెచ్ వేశారని అంటున్నారు. సదరు హీరో కి జానీ మాస్టర్ పార్టీ అధినేత కు గత కొన్ని రోజులుగా పొసగడం లేదు. ఎన్నికల సమయంలో సదరు హీరో కూడా జనసేన పార్టీ కి కాకుండా వ్యతిరేక పార్టీ కి సపోర్ట్ చేయడం ఆ పార్టీ , ఆ హీరో అభిమానులకు, సపోర్టర్స్ కి ఏమాత్రం నచ్చలేదు. దాంతో సోషల్ మీడియా లో వారిని తెగ ట్రోల్ చేశారు. ఈ కారణంగా సదరు హీరో రిలీజ్ అవ్వాల్సిన తన సినిమా కూడా వాయిదా వేసుకున్నాడు.

ఎన్నికలు పూర్తయ్యి అంతా సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో ఈ కేసు బయటకు రావడం ఇప్పుడు దేశాన్నే కుదిపేస్తోంది. అయితే ఆ హీరో కి, జానీ మాస్టర్ కు అస్సలు పడట్లేదని కొన్ని సంఘటనల ద్వారా తెలిసిందే. ఆ హీరో నటించిన సినిమా కి నేషనల్ అవార్డు రాగా ఆ సినిమాలోని పాటకు కూడా అవార్డు వచ్చింది. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసింది జానీ మాస్టరే. అయితే జానీ మాస్టర్ ను అభినందిస్తూ ఒక్క ట్వీట్, పోస్ట్ కానీ చేయలేదు. దీన్ని బట్టి వీరిద్దరికి పొసగడం లేదని చెప్పాలి. ఏదేమైనా ఈ ఇష్యూ ని ఆ పాన్ ఇండియా హీరో బయటకు తీసుకొచ్చాడని వస్తున్న విషయంలో ఎలాంటి ఆధారం లేదు కాబట్టి ఇది ఇప్పటివరకైతే రూమర్ అనే చెప్పాలి. ఇక కేసు విషయానికొస్తే దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందించింది. తక్షణమే న్యాయం జరిగేలా చూస్తామని వారు చెప్పారు. ఇక జానీ మాస్టర్ తెలుగు సినీ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.