Jani Master issue

Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బాగోతం ఒక్కొక్కటిగా మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే బాధిత మహిళ ఆయనపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ ఐ ఆర్ లో సంచలన విషయాలు పేర్కొంది. దీంతో జానీ మాస్టర్ బాగోతం బయటపడింది. అయితే ఈ విషయంలో జానీ మాస్టర్ స్పందించి నేను ఓ పాట విషయంలో కార్డు లేనివారిని తీసుకుంటే కార్డు ఉన్నవారికి అన్యాయం జరుగుతుంది అని చెప్పడం కారణంగానే నాపై ఇలా కుట్ర పెట్టుకొని ఆ అమ్మాయితో ఇలా చేస్తున్నారు అంటూ స్పందించారు.

Jani Master issue

గత ఆరు సంవత్సరాలుగా శ్రేష్ఠ అనే కొరియోగ్రాఫర్ ఆయన దగ్గర.అసిస్టెంట్ గా పని చేస్తుంది.. అయితే ఆమెపై ఈ ఆరేళ్లలో చాలాసార్లు లైంగిక దాడి చేశారని,అంతేకాకుండా ఒప్పుకోకపోతే తీవ్రంగా గాయపరిచారని చెప్పింది. ఇక గత కొద్దిరోజుల నుండి మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య కూడా నన్ను వేధిస్తోంది. అందుకే ఈ టార్చర్ ఇక భరించలేక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను అని చెప్పింది.(Jani Master)

Also Read: Poonam Kaur: మరోసారి తెరపైకి త్రివిక్రమ్ – పూనమ్ కౌర్ వివాదం.. సినీ పెద్దలు ఈసారి!!

అయితే ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు,హీరోలకు ఎఫైర్లు ఉంటాయి. వారి భార్యలు ఈ విషయం బయటపడితే అస్సలు సహించలేరు.వారికి విడాకులు ఇచ్చేసి వారి దారి వాళ్లు చూసుకుంటారు. కాని జానీ మాస్టర్ భార్య మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉంది.. జానీ మాస్టర్ భార్యనే స్వయంగా ఆ అమ్మాయిని తన భర్తని పెళ్లి చేసుకోమని వేధించిందట.

Jani Master issue

అంతే కాదు చాలాసార్లు ఇష్టం లేకపోయినా కూడా జానీ మాస్టర్ బెడ్రూంలోకి ఆమెని బలవంతంగా నెట్టేసిందట. ఇక ఈ విషయాన్ని కూడా బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో చాలామంది నెటిజన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో ఇష్టపడి చేసుకున్నా ఆ మహిళ ఎందుకు మరో మహిళను వేధిస్తూ జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోమని చెబుతుంది అని షాక్ అవుతున్నారు.(Jani Master)