Mahesh Babu secret wedding

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు పెళ్లికి చాలామంది అడ్డుపడ్డట్టు అప్పట్లో టాక్ వినిపించింది. అంతే కాదు మహేష్ బాబు ఎక్కడ దూరమవుతాడోనని భయపడి నమ్రత హడావిడిగా పెళ్లి చేసుకుంది అనే టాక్ కూడా వినిపించింది.అయితే నమ్రత మహేష్ బాబుల పెళ్ళికి ఎవరు అడ్డుపడ్డారు ఎందుకు అంత రహస్యంగా చేసుకోవలసి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం..

Mahesh Babu secret wedding

మహేష్ బాబు నమ్రతల పెళ్లికి మొదట కృష్ణ ఒప్పుకోలేదు. నమ్రత బాలీవుడ్ కి చెందిన హీరోయిన్ అని,ఆమెకి మన సాంప్రదాయాలు తెలియవు అని, ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్ కాబట్టి వద్దు అని చెప్పారట.కానీ మహేష్ బాబు సోదరి మంజుల మహేష్ తల్లి కృష్ణను ఒప్పించారట.అలా వీరి పెళ్లికి కృష్ణ ఒప్పుకున్నారు.కానీ మరొక సమస్య ఎక్కడ వచ్చింది అంటే..మహేష్ బాబు అమ్మమ్మ.. (Mahesh Babu)

Also Read: Poonam Kaur: మరోసారి తెరపైకి త్రివిక్రమ్ – పూనమ్ కౌర్ వివాదం.. సినీ పెద్దలు ఈసారి!!

మహేష్ బాబు అమ్మమ్మకి సాంప్రదాయాలు కులం, గోత్రం అనే పట్టింపులు ఎక్కువగా ఉంటాయట. దీంతో బాలీవుడ్ కి చెందిన నమ్రతని మహేష్ బాబు పెళ్లి చేసుకుంటానంటే అస్సలు ఒప్పుకోలేదట. అంతేకాదు మహేష్ బాబు నమ్రతకు జరుగుతున్న వివాహం మహేష్ అమ్మమ్మకు తెలియకుండా రహస్యంగా ఉంచేసి ముంబైకి తీసుకువెళ్లి పెళ్లి చేసారట.

Mahesh Babu secret wedding

వీరి పెళ్లి విషయం తెలుసుకున్న మహేష్ అమ్మమ్మ మీరు పెళ్లి చేసుకుంటున్నారని నాకు తెలిసింది.ఎక్క ఉన్నారు అని చెప్పగా తిరుపతిలో ఉన్నాము అని అబద్ధం చెప్పారట. అలా మహేష్ బాబు అమ్మమ్మ ఎక్కడ వారి పెళ్లి ఆపుతుందోనని భయపడి హడావిడిగా నమ్రత మహేష్ బాబులు రహస్యంగా ముంబైలో పెళ్లి చేసుకున్నారు.(Mahesh Babu)