NTR gave a wonderful gift to the director before the release of Devara

NTR: ప్రస్తుతం అందరి చూపు దేవర సినిమా పైనే ఉంది. ఎన్టీఆర్ జాన్వి కపూర్ కాంబినేషన్లో కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఆఆర్ర్ఆర్ మూవీ వంటి భారీ హిట్ తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు.ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ మూవీ తో రావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

NTR gave a wonderful gift to the director before the release of Devara

అయితే అలాంటి ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది.కాబట్టి ఇప్పటికే ముంబై నుండి సినీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసారు చిత్ర యూనిట్. ముంబైలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ మధ్యనే చెన్నైకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. చెన్నైలో కూడా ప్రమోషన్స్ నిర్వహించి తర్వాత హైదరాబాద్ కు వస్తారని సమాచారం.(NTR)

Also Read: Jani Master: జానీ మాస్టర్ బాగోతం బయటపడడానికి కారణం ఆ హీరోనేనా!!

ఈ విషయం పక్కన పెడితే దేవర సినిమా కంటే ముందు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య మూవీ అతిపెద్ద డిజాస్టర్ అయింది. దీంతో ఈయన అప్పుల పాలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ తన చేతికి లగ్జరీ వాచ్ ని పెట్టుకుని కనిపించాడు. ఇక ఈ వాచ్ ధర ఏకంగా కోటి 60 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ అప్పుల్లో ఉన్న కొరటాల శివ అంత ఖరీదైన వాచ్ పెట్టుకోవడం ఏంటి అని షాక్ అవుతున్నారు.

NTR gave a wonderful gift to the director before the release of Devara

అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..కొరటాల శివకి ఆ లగ్జరీ వాచ్ ని జూనియర్ ఎన్టీఆర్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక కొరటాల శివ తన చేతికి పెట్టుకున్న వాచ్ ఫటేక్ ఫిలిప్ నాటిలస్ అనే అంతర్జాతీయ బ్రాండ్ కి సంబంధించిన ఈ వాచ్ ఎక్కువగా ఎన్టీఆర్ చేతికే కనిపిస్తుంది. దాంతో ఈ వాచ్ ని కొరటాల శివకు గిఫ్టుగా ఇచ్చింది ఎన్టీఆర్ అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.(NTR)