Jani Master hiding in the house of Tollywood star hero

Jani Master: ప్రస్తుతం ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కి సంబంధించిన రచ్చ కొనసాగుతోంది.ఈయన తన దగ్గర పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ ని లైంగికంగా వేధించాడు అనే వార్తలు మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ జనాలతో పాటు చాలామంది సామాన్యులు కూడా జానీ మాస్టర్ పై విరుచుకు పడుతున్నారు.

Jani Master hiding in the house of Tollywood star hero

ఇలాంటి చీడపురుగులు ఉన్నంతకాలం ఇండస్ట్రీలో ఉన్న ఫిమేల్ ఆర్టిస్టులకి స్వేచ్ఛ స్వతంత్రం రావు అంటూ తిట్టిపోస్తూ కచ్చితంగా జానీ మాస్టర్ పై యాక్షన్ తీసుకోవాలని అనసూయ, కరాటే కళ్యాణి తో పాటు స్టార్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ కూడా సపోర్ట్ ఇచ్చారు. అయితే అలాంటి జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలుస్తోంది.(Jani Master)

Also Read: Jani Master: జానీ మాస్టర్ బాగోతం బయటపడడానికి కారణం ఆ హీరోనేనా!!

ఈయనని పోలీసులు అరెస్టు చేయడానికి వెళితే ఇంట్లో లేడని తెలిసిందని,అసలు హైదరాబాదులోనే లేడని, పూర్తిగా తెలంగాణ వదిలేసి ఎక్కడికో పారిపోయాడని కొన్ని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ఒక టాలీవుడ్ హీరో ఇంట్లో జానీ మాస్టర్ తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఇక మొదటి నుండి ఆ హీరోకి సన్నిహితుడిగా ఉన్న జానీ మాస్టర్ ప్రస్తుతం ఆ హీరో ఇంట్లోనే దొంగ చాటుగా దాక్కున్నట్టు తెలుస్తోంది.

Jani Master hiding in the house of Tollywood star hero

దీంతో ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు ఆ టాలీవుడ్ హీరో ఇంటికి కూడా వెళ్లారట.కానీ అక్కడ కూడా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో వచ్చేవన్నీ రూమర్సే అని పోలీసులు వాటిని కొట్టి పారేశారు.మరి ఇంతకీ జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నారు.. ఎందుకు పోలీసులు ఆయనను పట్టుకోవడంలో విఫలమయ్యారు.. నిజంగానే ఆయనకు ఎవరైనా వెనక నుండి సపోర్ట్ చేస్తున్నారా.. అందుకే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం లేదా అనేది తెలియాల్సి ఉంది.(Jani Master)