Prakash Raj Sensational comments on Pawan Kalyan

Prakash Raj:ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం తిరుమల లడ్డు చుట్టే తిరుగుతున్నాయి.. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఆహార పదార్థం అయినటువంటి తిరుమల లడ్డు లో చేపనూనె, జంతు నూనె వంటి వాటితో పాటు నాసిరకమైన ఆహార పదార్థాలు కలిపి తిరుమల లడ్డుని అపవిత్రం చేశారంటూ టిడిపి ప్రభుత్వం మండిపడింది. ఇక ఈ విషయంలో అటు వైసిపి వాళ్ళు ఇటు టిడిపి వాళ్ళ మధ్య రచ్చ జరుగుతుంది.

Prakash Raj Sensational comments on Pawan Kalyan

ఇలాంటి నేపథ్యంలోనే టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా ఈ విషయంపై స్పందించింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు.మరి ఇంతకీ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా కౌంటర్ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.. (Prakash Raj)

Also Read: Genelia: అర్ధరాత్రి జెనీలియాని ఆ పని చేయమని టార్చర్.. బన్నీ ఎంట్రీ తో సీన్ రివర్స్..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెట్ ఆర్టిస్ట్ గా..విలన్ గా.. ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన ప్రకాష్ రాజ్ ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోయి నటిస్తారు. ఈయన సినిమాలో చేసే ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అలాంటి ప్రకాష్ రాజ్ తాజాగా పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ పై సంచలన ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో ఏం పెట్టారంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు.

Prakash Raj Sensational comments on Pawan Kalyan

కాబట్టి అక్కడ జరిగిన గొడవ ఏంటో ముందుగా మీరు దర్యాప్తు చేసి నిజంగానే తప్పు జరిగితే నేరస్తులను కఠినంగా శిక్షించండి. ఆ పని చేయకుండా ఊహగానాల్ని వ్యాప్తి చెందంచడం ఎందుకు..ఇంకా మత కల్లోలాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్న మీ స్నేహితుల కారణంగా దేశంలో మత కల్లోలాలు ఎక్కువైపోయాయి అవి చాలు అంటూ తనదైన శైలిలో సెటైరికల్ గా ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. అలా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించడంతో పవన్ అభిమానులు ప్రకాష్ రాజ్ పై మండిపడుతున్నారు.(Prakash Raj)