Is it true that Raasi is in love with that hero

Raasi: సీనియర్ నటి రాశి అంటే తెలియని వారు ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే సినిమాల్లో అవకాశాలు తగ్గాక కూడా సీరియల్స్ ద్వారా రాణిస్తోంది. అలా స్టార్ మా లో వచ్చే జానకి కలగనలేదు సీరియల్లో జ్ఞానంబా పాత్ర పోషించింది.. అలా బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గర అయిపోయినటువంటి రాశికి ప్రస్తుతం ఎక్కువగా అవకాశాలు రావడం లేదు.

Is it true that Raasi is in love with that hero

ఏదో చిన్నాచితక పాత్రలు వచ్చినప్పటికీ అది కూడా సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒకసారి వస్తుంది. అయితే అలాంటి రాశి గురించి ఇప్పుడు ఓ విషయం తెలుసుకుందాం. అదేంటంటే..హీరోయిన్ రాశిపై గతంలో ఒక వార్త మీడియాలో వైరల్ అయింది.అదేంటంటే రాశి ఓ హీరోతో డేటింగ్ తో ఇండస్ట్రీలో బుక్ అయిపోయింది అనే న్యూస్ తెగ వైరల్ అయింది. (Raasi)

Also Read: Venkatesh: మత్తుమందు ఇచ్చిఆ హీరోయిన్ తో వెంకటేష్ శృ**గారం.. రామా నాయుడు ఎంట్రీ తో.?

అయితే హీరోయిన్ రాశికి రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, జగపతిబాబు వంటి ఎంతో మంది హీరోలతో ఎఫైర్ వార్తలు కూడా వినిపించాయి.ఇక వారందరిలో మరో హీరో కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు గోపీచంద్.అయితే గోపీచంద్ పై ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్ వినిపించలేదు. కానీ మహేష్ బాబు చేసిన నిజం సినిమాలో విలన్ పాత్రలో గోపీచంద్ చేశారు. అంతేకాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాశి కూడా నటించింది.అయితే ఈ సినిమా చేశాక రాశికి అవకాశాలన్నీ తగ్గిపోయాయి.

Is it true that Raasi is in love with that hero

అంతేకాదు ఈ మూవీ డైరెక్టర్ తేజ తనని అలా చూపించడం పట్ల చాలా అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. సినిమా తర్వాత రాశికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి అనే ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అలాంటి ఈ బ్యూటీ నిజం సినిమా చేసే సమయంలో గోపీచంద్ తో డేటింగ్ చేస్తుంది అనే వార్తలు మీడియాలో గుప్పమన్నాయి. కానీ ఈ వార్తలపై అటు రాశి గాని ఇటు గోపీచంద్ కానీ స్పందించకపోవడంతో ఇవి కొంతమంది ఆకతాయిలు పుట్టించిన రూమర్లు అని కొట్టిపారేశారు.(Raasi)