That director used all the heroines Suchitra comments viral

Suchitra: సింగర్ సుచిత్ర అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఈమె సుచీ లీక్స్ ద్వారా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు.సుచీ లీక్స్ ద్వారా ఎంతో గుట్టుగా వారి వ్యవహారాలను నడిపించుకుంటున్న చాలా మంది సెలబ్రెటీల బాగోతాలన్నీ బయట పెట్టేసింది.అలా ధనుష్, త్రిష,అనిరుద్, ఆండ్రియా ఇలా ఎంతోమందికి సంబంధించిన పర్సనల్ విషయాలను, ఫొటోస్ ని బయటపెట్టేసింది సుచిత్ర. దాంతో ఈమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.

That director used all the heroines Suchitra comments viral

ఇక ప్రస్తుతం సుచిత్ర కొన్ని ఇంటర్వ్యూలలో ఎన్నో షాకింగ్ కామెంట్లు చేస్తుంది. తన మాజీ భర్త కార్తీక్, ధనుష్ ఇద్దరు గే లు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. అంతేకాదు ధనుష్ చాలామందిని వాడుకున్నాడని ఐశ్వర్య రజినీకాంత్ మీద కూడా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఇలా ఈమె మాటలు విన్న కొంతమంది ఆమెకు మెంటల్ అని, మతిస్థిమితం సరిగ్గా లేదని, అందుకే అలాంటి మాటలు మాట్లాడుతుందని, పిచ్చి పట్టిందని మాట్లాడుకున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా ఒక లెజండరీ డైరెక్టర్ పై సుచిత్ర చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి.

Also Read: Rajinikanth: అనిరుధ్‌ తో కలిసి తలైవా స్టెప్పులు.. అదిరిన స్టేడియం!!

మరి ఇంతకీ ఆ లెజండరీ డైరెక్టర్ ఎవరా అనుకుంటున్నారా.. ఆయన ఎవరో కాదు ఎంతోమంది హీరోలను స్టార్స్ ని చేసి ది లెజెండరీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బాల చందర్.. దర్శకుడు బాలచందర్ అంటే ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు.కానీ అప్పట్లో చాలా పేరున్న డైరెక్టర్ ఈయన దర్శకత్వంలో రజినీకాంత్, కమల్ హాసన్,చిరంజీవి వంటి ఎంతో మంది హీరోలు స్టార్స్ అయ్యారు. అయితే అలాంటి ఒక పెద్ద దర్శకుడు మీద సింగర్ సుచిత్ర చేసిన కామెంట్లు మీడియాలో దుమారం సృష్టించాయి.

That director used all the heroines Suchitra comments viral

ఆమె బాలచందర్ గురించి మాట్లాడుతూ.. బాలచందర్ ఒక కామపిశాచి.ఆయన తనతో సినిమాలు చేసేహీరోయిన్ ని కూడా వదిలేవాడు కాదు. బాలచందర్ చనిపోయే వరకు కూడా లస్టి మ్యాన్ గానే ఉన్నారు.. ఆయన ఎంతోమందిని తన ఫామ్ హౌస్ కి రమ్మనేవారు. అలా ఓసారి నన్ను కూడా పిలిచారు.కానీ ఆయన ప్రవర్తన గమనించి నేను వెళ్ళలేదు. అంతే కాదు అమ్మాయిలని కామంతో చూస్తూ అసభ్యంగా ముట్టుకునేవాడు. ఆయనో పెద్ద కామపిశాచి అంటూ సంచలన కామెంట్లు చేసింది. ఇక సుచిత్ర మాటలు విన్న చాలామంది బాలచందర్ అభిమానులు చనిపోయిన డైరెక్టర్ పై ఇలాంటి మాటలు తగదు.వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ మండిపడుతున్నారు.(Suchitra)