Real story of Bigg Boss Soniya

Soniya: బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ సోనియాకి పెళ్లయ్యిందా.. విడాకులు కూడా అయ్యాయా.. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది. కరీంనగర్ కి చెందిన సోనియా సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి రావాలని ముందు యాంకర్ గా ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఆ తర్వాత మోడలింగ్ రంగంలో రాణించి చిన్నాచితకా సినిమాల్లో నటించింది.

Real story of Bigg Boss Soniya

అలా ఆర్జీవి దర్శకత్వంలో ఓ సినిమా చేసినప్పటికీ అంత గుర్తింపు అయితే రాలేదు. అయితే అలాంటి ఈ బ్యూటీ ఆర్జీవి బ్యూటీగా టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయింది ఇక ఈ ప్రొఫైల్ చూసిన బిగ్ బాస్ వాళ్ళు అవకాశం ఇచ్చారట. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళాక సోనియా తన మాట తీరుతో నెగిటివిటీ తెచ్చుకుంటుంది. ముఖ్యంగా నిఖిల్ తో లవ్ ఎఫైర్ ఓవైపు నడిపిస్తూనే మరోవైపు అన్నా అంటూ పిలుస్తోంది. (Soniya)

Also Read: Kajal: కాజల్ తో రొమాన్స్ అంటే భయపడి పారిపోయిన స్టార్ హీరో..?

ఇక సోనియా మీద నెగిటివిటీ ఎక్కువగా రావడంతో సోనియా తల్లిదండ్రులు మా బిడ్డ గురించి అలా చూపించి బద్నాం చేయకండి.మా బిడ్డకు ఇప్పటికే పెళ్లి ఫిక్స్ అయింది.అత్తింటి వారి అనుమతితోనే హౌస్ లోకి వెళ్ళింది అని చెప్పారు. ఇక మరొక సెన్సేషనల్ విషయం ఏంటంటే బిగ్ బాస్ సోనియా కి ముందే పెళ్లయిపోయిందట.

Real story of Bigg Boss Soniya

సినిమాల్లోకి రాకముందే ఆమెకు ఓ వ్యక్తితో పెళ్లి చేసేసారట ఇంట్లో వాళ్ళు.కానీ సినిమాల్లోకి వచ్చాక సోనియా భర్తకి, సోనియాకి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరి మధ్య పోసగదని చెప్పేసి విడాకులు తీసుకున్నారట. అలా విడాకుల తర్వాత సినిమాల్లో మరింత యాక్టివ్ అయింది సోనియా. మరి బిగ్ బాస్ సోనియా కి పెళ్ళై విడాకులు అయ్యాయి అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.(Soniya)