Harsha Sai: యూట్యూబ్, ఇన్స్టా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయిపోయారు. అలాంటి వారిలో హర్ష సాయి కూడా ఒకరు. ఈయన కేవలం యూట్యూబర్ మాత్రమే కాదు నటుడు కూడా.. ఇక హర్ష సాయి అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఈయన ఎంతోమంది పేదలకు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తూ వారి మన్ననలు అందుకున్నారు.అంతేకాదు ఫ్రీ పెట్రోల్ బంక్ వంటిది స్టార్ట్ చేసి లక్షలాదిమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు.
Case registered against Harsha Sai
అయితే అలాంటి యూట్యూబర్ హర్ష సాయి నిజస్వరూపం తాజాగా బయటపడింది. ఒక నటి తాజాగా హర్ష సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నాపై అత్యాచారం చేయడమే కాకుండా న్యూడ్ ఫొటోస్ తీసి బెదిరిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది. మరి ఇంతకీ ఆమె ఎవరు అనేది చూస్తే.. తెలుగు రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ అందరికీ తెలుసు. ఇక బిగ్ బాస్ ఓటిటి సీజన్ కూడా చాలామంది చూసే ఉంటారు. అయితే ఈ బిగ్ బాస్ ఓటిటి సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మిత్రాశర్మ అప్పట్లో ఫేమస్ అయిపోయింది.(Harsha Sai)
Also Read: Johnny Master Controversy: జానీ మాస్టర్ వివాదంపై సింగర్ చిన్మయి.. ఆ కుక్కని!!
అయితే ఇప్పుడు అంత యాక్టివ్ గా లేకపోయినప్పటికీ ఆ మధ్యకాలంలో యూట్యూబర్ హర్ష సాయి తో ఓ సినిమాని అనౌన్స్ చేసింది. అయితే మళ్లీ సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ హర్ష సాయి వివాదంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్లో హర్ష సాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి లైంగికంగా వాడుకున్నాక వదిలేసాడు. నా నుండి రెండు కోట్లు కూడా తీసుకున్నాడు.
ఈ విషయం బయట చెబితే నీకు సంబంధించిన న్యూడ్ వీడియోలు, ఫోటోలు బయట పెడతానని బెదిరించాడు. ఇన్ని రోజులుగా ఇంట్లోనే భయపడి కూర్చున్న నేను మొదటిసారి బయటికి వచ్చి ఈ విషయంలో కంప్లైంట్ చేస్తున్నాను నాకు న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇక హర్ష సాయి బాధితురాలు మిత్ర శర్మని తాజాగా హాస్పిటల్ కి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు . ఇక ఒక్కసారిగా హర్ష సాయి వివాదం బయటికి రావడంతో చాలామంది ఈయనతో సహాయం పొందిన వాళ్లు కూడా ఈయనను తిట్టుకుంటున్నారు. ఇక మిత్ర శర్మ కేవలం హర్ష సాయి మీదే కాకుండా ఆయన తండ్రి మీద కూడా కేసు నమోదు చేసింది.(Harsha Sai)