Jayam Ravi filed a case against his wife

Jayam Ravi: జయం రవి వివాదం రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది.ఆయన తన భార్యకి ఇష్టం లేకుండానే విడాకులు ఇచ్చారని ఆర్తి చెప్పడంతో ఇది సంచలనగా మారింది. అయితే చాలాసార్లు రవిని కలిసి మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ అవకాశం దొరకలేదని ప్రస్తుతం నేను నా పిల్లల ఫ్యూచర్ కోసం కృషి చేస్తానని ఆర్తి చెప్పింది అయితే ఆర్తి మాటలను అస్సలు తీసుకోలేకపోయారు జయం రవి.వెంటనే స్పందించి ఆర్తి చెప్పేవన్నీ అబద్ధాలే..

Jayam Ravi filed a case against his wife

ఎందుకంటే నేను ఈ విషయం అందరికీ చెప్పే చేశాను. విడాకుల నోటీసులు కూడా నా లాయర్ ద్వారా ఆర్తి ఇంటికి పంపించాను. ఆర్తి తండ్రి,ఆర్తి,నా పెద్దకొడుకుకి కూడా ఈ విషయం తెలుసు. మేం విడాకులు తీసుకుంటున్నాం అనేది ఇద్దరం అనుకొనే చేసాం.కానీ ఆర్తి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతుందో నాకు తెలియదు. ఇక ఆర్తి ఇంటి నుండి నేను కట్టుబట్టలతో బయటకు వచ్చేసాను.(Jayam Ravi)

Also Read: Chiranjeevi: చిరు, కొరటాల శివ కి ఉన్న విబేధాలు ఇవే.. క్లియర్ అయ్యాయా?

ఒక్క రూపాయి కూడా ఇంటి నుండి బయటకు తీసుకురాలేదు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు జయం రవి. అయితే తాజాగా జయం రవి తన భార్యపై కేసు పెట్టినట్టు తెలుస్తోంది. తన ఇంట్లో ఉండే తనకు సంబంధించిన సామాను తనకు ఇచ్చేయాలని భార్యపై జయం రవి కేసు పెట్టినట్టు తెలుస్తోంది. చెన్నైలోని ఈసీఆర్ రోడ్ లో ఆర్తి ఈ కి సంబంధించిన సొంత ఇల్లు ఉంది.అయితే ఈ ఇంట్లోనే చాలా సంవత్సరాలుగా ఆర్తి, జయం రవి కాపురం ఉంటున్నారు.

Jayam Ravi filed a case against his wife

అయితే ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో ఆర్తి ఇంట్లో ఉండే జయం రవికి సంబంధించిన వస్తువులన్నీ ఇచ్చేయాలని కేసు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ జయం రవికి సింగర్ కెనీషాతో ఎఫైర్ ఉంది అనే నిజం తెలియగానే ఆర్తి దూరం పెట్టి ఆయన్ని ఇంటి నుండి మెడపట్టి బయటికి గెంటేసిందని, అందుకే ప్రస్తుతం ఆయన ఇంటి నుండి వచ్చేసి వేరే ఇంట్లో రెంట్ కి ఉంటున్నట్టు తెలుస్తోంది.(Jayam Ravi)