Mahesh Babu: రాజమౌళి మరియు మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్‌లోని సినిమా అంటే అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ సినిమా కి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహేశ్ బాబు కొత్త లుక్ బయటకి రావడం. సినిమా ప్రారంభానికే ముందే మహేశ్ బాబు తన కొత్త లుక్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.

Mahesh Babu Reveals His Look Before Rajamouli Shooting Begins

సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో హీరోల లుక్‌ను సర్‌ప్రైజ్‌గా ఉంచాలని కోరుకుంటారు. కానీ, మహేశ్ బాబు మాత్రం తన కొత్త లుక్‌తో ఇప్పటికే పలు వేడుకల్లో కనిపించడం గమనార్హం. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం తో మహేశ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మహేశ్ బాబు తన కొత్త లుక్‌తో ఇప్పటికే అభిమానులను అలరించారు. కానీ, ఇది మహేశ్ బాబు ఫైనల్ లుక్‌ కాదని, సినిమా కోసం మరింత మేకోవర్‌ చేయబోతున్నారని సమాచారం. అంటే, మనం ఇప్పుడు చూస్తున్నది కేవలం ఆరంభం మాత్రమే అన్నమాట.

Also Read: Devara: ప్రభాస్ రికార్డ్స్ ను గల్లంతు చేస్తున్న ఎన్టీఆర్.. ఆ ఒక్కటే బాకీ!!

రాజమౌళి సినిమాల్లో ఇంతకు ముందు హీరోలు తమ లుక్‌ను సీక్రెట్‌గా ఉంచేవారు. కానీ, మహేశ్ బాబు మాత్రం తన లుక్‌ను బయటపెట్టడానికి ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారో తెలియదు. ఏదేమైనా, మహేశ్ బాబు కొత్త లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. రాజమౌళి మరియు మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.