MUDA case Siddaramaiah: కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కర్ణాటక రాష్ట్రంలో నెలకొంది. గత ఏడాది కిందట ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం లో… అనేక అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడా కేసులో…ఇరుక్కున్నారు. ఈ కేసులో ఆయన భారీ స్కాం చేసినట్లు సమాచారం. అయితే ఈ కేసులో… ప్రస్తుతం విచారణ జరుగుతుంది. MUDA case Siddaramaiah

MUDA case Siddaramaiah accuses BJP of revenge politics after Karnataka High Court setback

ఇలాంటి నేపథ్యంలోనే… కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించాలని… ఏసీబీ అధికారులు రెడీ అయ్యారు. కానీ తనను విచారించకూడదని హైకోర్టును ఆశ్రయించారు సిద్ధరామయ్య. అయితే తాజాగా హైకోర్టు… సిద్ధరామయ్యకు ఊహించని షాక్ ఇచ్చింది. చట్టం ముందు అందరు సమానులేనని… సిద్ధరామయ్యను విచారించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు సిద్ధరామయ్య వేసిన పిటిషన్ కూడా కొట్టివేసింది కర్ణాటక హైకోర్టు. దీంతో సిద్ధరామయ్యను విచారించాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. MUDA case Siddaramaiah

Also Read: Tirumala Laddu: బాబుకు షాక్‌…సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి సంచలన పిటిష‌న్‌!

అయితే ఈ కేసు నేపథ్యంలో కర్ణాటక కు కొత్త ముఖ్యమంత్రి వస్తారని… సిద్ధరామయ్య అరెస్టు కావడం గ్యారంటీ అని కొంతమంది అంటున్నారు. దీనికి తగ్గట్టుగానే డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తన తరఫున ఉన్న ఎమ్మెల్యేలను… పిలిపించుకొని చర్చించుతున్నారట. ఒకవేళ సిద్ధరామయ్య పదవి పోతే డీకే శివకుమార్ కు వచ్చేలా రంగం సిద్ధం చేస్తున్నారట.కానీ డీకే శివకుమార్ పైన కూడా చాలా కేసులో ఉన్న నేపథ్యంలో ఆయనకు కూడా సీఎం పదవి వచ్చే ఛాన్స్ లేదని కొంతమంది అంటున్నారు. దీంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. MUDA case Siddaramaiah