Crazy update on Tarak's "Devara"

Devara: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా విడుదలకు కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నాయి. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం వైరల్‌గా మారింది.

NTR’s Triple Role in Devara: Confirmed by Ratnavelu

ఈ విషయంపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పందిస్తూ, ఎన్టీఆర్ ఈ సినిమాలో డబుల్ రోల్ మాత్రమే చేస్తున్నారని స్పష్టం చేశారు. “సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానెళ్లు ఏదైనా చెబుతాయి. కానీ ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్నారనేది నిజం కాదు. ఆయన తండ్రి-కోడుకుల పాత్రల్లో నటిస్తున్నారా లేదా అన్నదమ్ములుగా నటిస్తున్నారా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది” అని రత్నవేలు తెలిపారు.

Also Read: Lemon Water: ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగితే.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?

‘దేవర’ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డాను అని రత్నవేలు చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాకు కలర్ గ్రేడింగ్ చేయడానికి 30 రోజులు నిద్ర లేకుండా పనిచేశానని తెలిపారు.రత్నవేలు ఇంత స్పష్టంగా చెప్పడం ద్వారా ట్రిపుల్ రోల్ గురించి వచ్చే ఊహాగానాలు కట్టిపెట్టినట్లే. ‘దేవర’ సినిమా కోసం తామెంత కష్టపడిందో వివరించిన ఆయన, 30 రోజులు నిద్ర లేకుండా ఈ సినిమాకు కలర్ గ్రేడింగ్ చేసినట్లు తెలిపారు. ఎక్కువగా సుకుమార్ సినిమాలకు పని చేసిన రత్నవేలు, ‘దేవర’ కోసం కొరటాల శివతో తొలిసారి పనిచేశారు.