Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసులో.. సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఎదురయింది. ఈ ఓటుకు నోటు కేసులో కోర్టుకు రావాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చింది నాంపల్లి కోర్టు. మంగళవారం జరిగిన విచారణలో రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడం పట్ల… అసంతృప్తి వ్యక్తం చేసింది నాంపల్లి కోర్టు. Revanth Reddy

Revanth Reddy cash-for-vote case UPDATE

అంతేకాదు ఈ ఓటుకు నోటు కేసును అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 16వ తేదీన కచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… విచారణకు హాజరు కావాల్సిందేనని.. కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనని వెల్లడించింది. ముఖ్యమంత్రి అయినా కూడా తమకు సంబంధం లేదని.. నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది.
వాస్తవంగా.. ఈ ఓటుకు నోటు కేసును.. మధ్యప్రదేశ్ లేదా ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని గులాబీ పార్టీ నేత జగదీశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. Revanth Reddy

Also Read: Tirumala Laddu: చంద్రబాబుకు చిక్కులు…తిరుమల లడ్డు ఆరోపణలపై భూమన ప్రమాణం !

అయితే ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టు.. రేవంత్ రెడ్డికి ఊరటను ఇచ్చింది. తెలంగాణలోనే ఈ కేసును విచారించాలని ఏసీబీ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. కానీ కేసు వివరాలు మాత్రం రేవంత్ రెడ్డికి అస్సలు చెప్పకూడదని.. చెబితే కఠిన చర్యలు తప్పవని సుప్రీంకోర్టు.. ఏసీబీ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. కానీ తాజాగా నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా.. అక్టోబర్ 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు రావాలని ఈ పేర్కొంది. దీంతో ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. Revanth Reddy