Singer Chinmayi Responds to Johnny Master Controversy

Johnny Master Controversy: టాలీవుడ్ సినీ పరిశ్రమలో జానీ మాస్టర్ కేసు పెద్ద సంచలనంగా మారింది. టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ ఇలా వ్యవహరించాడా అని అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. మైనర్ వయసులో ఉన్న ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో కేసు నమోదైంది, కాగా పోలీసులు ఇప్పటికే జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.

Singer Chinmayi Responds to Johnny Master Controversy

జానీ మాస్టర్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించాడు. ఈ కేసు గురించి సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. చాలా మంది గతంలో తాము కూడా ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్నామని వెల్లడిస్తున్నారు.

Also Read: MUDA case Siddaramaiah: సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ.. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి?

సౌత్ ఇండియాలో లైంగిక వేధింపులపై తరచూ స్పందించే సింగర్ చిన్మయి ఈ వివాదంపై కూడా తన అభిప్రాయాలను వెల్లడించింది. ఇటీవల జానీ మాస్టర్ కేసుపై ఆమె వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ, “నేను రికార్డింగ్‌కు వెళ్లినప్పుడు వైరముత్తును పిలవకుండా ఉండమని చిత్రబృందానికి చెబుతాను. రికార్డింగ్ పూర్తయిన తర్వాతే అతడిని పిలవమని కోరుతాను, ఎందుకంటే ఒకసారి అతను నాతో సరసాలు చేయడానికి ప్రయత్నించాడు” అని పేర్కొంది.

చిన్మయి ఇంకా తన వ్యాఖ్యలలో, “వైరముత్తుకు బలమైన రాజకీయ అనుబంధం ఉంది. కోలీవుడ్‌లో లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ విషయంలో టాలీవుడ్ కొంత మెరుగ్గానే ఉంది, అక్కడ వేధింపులు తక్కువగా ఉంటాయి. జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి అందరూ మద్దతు ఇవ్వడం ప్రశంసనీయమైన విషయం. అతని వయసు, స్థాయిని పట్టించుకోకుండా అరెస్ట్ చేయడం మంచి నిర్ణయం” అని అభిప్రాయపడింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.