Sobhita Dhulipala: చైతన్య మరియు శోభితల నిశ్చితార్థం తర్వాత వారి అభిమానులు వీరి పెళ్లి గురించిన ముచ్చట్లు వినడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శోభిత తన పెళ్లి గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. “లవ్ సితార” సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, శోభిత తన పెళ్లి గురించి మాట్లాడింది. “నేను ఈ క్షణంలోకి ఎంతో అంచనాలు లేదా కలలతో వచ్చినట్లు అనుకోను. ఈ దశలో నేను ఉన్నాను అని అనిపిస్తుంది. ఇది చాలా సింపుల్‌గా, స్వీట్‌గా, సన్నిహితంగా, వామ్‌గా ఉంది. నేను ఊహించినదే జరుగుతోంది” అని తెలిపింది.

Sobhita Dhulipala Opens Up About Marriage

పెళ్లి అనేది తన మూలాలకు, వారసత్వానికి చాలా దగ్గరగా ఉందని, కాబట్టి తన పెళ్లిలో సంప్రదాయాలు తప్పకుండా ఉండాలని ఆమె కోరుకుంటున్నట్లు చెప్పింది. “వయసు పెరుగుతున్నప్పుడే ఆ దశలో నేను పెళ్లి వేడుకలో తెలుగుదనం తప్పకుండా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే నా మూలాలకు చాలా దగ్గరగా ఉన్నాను. కాబట్టి సంప్రదాయం అనేది నా పెళ్లిలో తప్పక ఉండాలని నేను ఊహిస్తున్నాను” అని శోభిత చెప్పింది.

Also Read: Justice Hema Committee: మొన్న జానీ మాస్టర్..నిన్న హర్ష సాయి..నేడు మరో నటుడు.. అత్యాచారం కేసులో జైలుకి!!

శోభిత మరియు చైతన్యల నిశ్చితార్థం ఆగస్ట్ 8న జరిగింది. వారి పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే, వారిద్దరూ తమ కెరీర్‌పై దృష్టి సారించి ఉన్నారు.