Tamil fans giving warning to Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈయన రీసెంట్గా దుర్గ గుడి మెట్లు కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ప్రెస్ మీట్ లో నటుడు కార్తి,ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఇక ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లపై ఆయన మళ్ళి క్లారిటీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక కార్తీ తన సత్యం సుందరం సినిమా ప్రమోషన్స్ లో లడ్డు కావాలా నాయనా అని యాంకర్ అడగగా ..లడ్డు చాలా సెన్సిటివ్ ఇష్యూ అని ఇప్పుడు దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది అని లడ్డు వద్దు బాబాయ్ అని ఎక్స్ప్రెషన్స్ పెట్టారు.

Tamil fans giving warning to Pawan Kalyan

అయితే ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ దీనిపై ఫైర్ అయ్యి నటుడుగా ఆయనంటే నాకు గౌరవం.కానీ ఇలా దేవుడి లడ్డు మీద ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు.ఏదైనా మాట మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి అంటూ ఫైర్ అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ మాటలకు కార్తీ క్షమాపణలు చెప్పి నేను ఎలాంటి తప్పు మాటలు మాట్లాడలేదు.(Pawan Kalyan)

Also Read: Pawan Kalyan: పవన్ కు కార్తీ క్షమాపణ చెప్పడం ఎంతవరకు కరెక్ట్!!

కానీ నన్ను క్షమించండి అంటూ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా కార్తి అన్న సూర్య కూడా తమ్ముడు మాటలకు సారీ చెప్పారు.అయితే ఈ విషయం పవన్ ఫ్యాన్స్ ని సంబరపరిచినప్పటికీ తమిళ్ ఫాన్స్ మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కార్తీ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులేదు. ఆయన లడ్డు మీద ఎలాంటి అసభ్య కామెంట్లు చేయలేదు. వివాదాస్పద కామెంట్లు చేయలేదు. ఆయన కేవలం ఆ విషయం గురించి మాట్లాడను అని వదిలేసాడు అంతే.

Tamil fans giving warning to Pawan Kalyan

కానీ దీనికే పవన్ కళ్యాణ్ కార్తీ ని పట్టుకొని మీడియా వేదికగా ఏకపారేశారు.దాంతో పవన్ కళ్యాణ్ పై తమితంబీలు ఫైర్ అవుతున్నారు. నీ సినిమాలు ఇప్పటినుండి మా తమిళ్లో బ్యాన్ చేస్తాం.నువ్వు క్షమాపణలు చెప్పాల్సిందే. అసలు కార్తి మాట్లాడిన దాంట్లో ఏం తప్పు కనిపించింది.అంతకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు.వారిని ఏమి చేయలేక కార్తీ పై ఫైర్ అవుతున్నావు అంటూ తమిళ తంబీలు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.(Pawan Kalyan)