Rajamouli Prepares Special Look for Mahesh Babu

Rajamouli: సాధారణంగా, రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న హీరోలు బయట కనిపించడం తగ్గిస్తారు. రాజమౌళి అనుమతి లేకుండా వారు వేరే సినిమాల్లో నటించడం లేదా పబ్లిక్ ఈవెంట్స్‌కు హాజరు కావడం అనేది జరగదు. ఉదాహరణకు, “ఆర్ఆర్ఆర్” సమయంలో రామ్ చరణ్, “ఆచార్య”లో ప్రత్యేక పాత్ర చేయడానికి కొరటాల శివతో పాటు చిరంజీవి స్వయంగా రాజమౌళిని అడిగితే తప్ప వీలు కాలేదు. కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

Rajamouli Prepares Special Look for Mahesh Babu

మహేష్ బాబు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇంత స్వేచ్ఛ మహేష్‌కే ఎందుకు అని అందరికీ అనుమానం వచ్చింది. టీమ్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, మహేష్ ప్రస్తుతం కనిపిస్తున్న లుక్ కాకుండా, సినిమా కోసం ప్రత్యేకమైన లుక్‌ను రూపొందించాలని రాజమౌళి భావిస్తున్నారు. దీనికోసం మహేష్ జుట్టు, గెడ్డం, మీసం పెంచుకోవాలి.

Also Read: Mahesh Babu: మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఫిక్స్?

ఆ తర్వాత విదేశాల నుంచి హెయిర్ స్టైలిస్టులను పిలిపించి, అతనికి సరిపోయే లుక్‌ను డిజైన్ చేస్తారు. ఆ లుక్ ఫైనల్ అయ్యాకే మహేష్ బయ కనిపించడం తగ్గిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. అంతవరకు మహేష్ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే, సినిమాకి సంబంధించిన అధికారిక వివరాలను రాజమౌళి ఇంకా వెల్లడించలేదు. అభిమానులు ఆ వివరాల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ, కొంత సమయం పట్టే అవకాశం ఉంది.