The first review of Devara movie

Devara: దేవర సినిమాపై చాలామంది నందమూరి అభిమానులతో పాటు మిగతా హీరోల అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా మరి కొద్ది గంటల్లో ఇండియాలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.ముఖ్యంగా దేవర సినిమా ఓవర్సీస్ లో చూసిన డిస్ట్రిబ్యూటర్స్ షాకింగ్ రివ్యూలు ఇస్తున్నారు.

The first review of Devara movie

ఇక రివ్యూలు చూసిన చాలా మంది నందమూరి అభిమానులు షాక్ లో మునిగిపోతున్నారు. మరి ఇంతకీ ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన రివ్యూలు ఎలా ఉన్నాయి అంటే.. కొంతమందేమో దేవర యాక్షన్స్ సన్నివేషాలు చాలా బాగున్నాయి అంటే మరి కొంతమంది ఏమో స్క్రీన్ ప్లే రివర్స్ లో ఉండడం కారణంగా ఈ సినిమా చూసి ఆడియన్స్ కాస్త కన్ఫ్యూజన్లో పడిపోతారని, ఈ సినిమాకి ఈ ఒక్క మైనస్ తప్ప మిగిలినవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అంటూ రివ్యూలు ఇస్తున్నారు. (Devara)

Also Read: Devara: దేవర ఆ పదినిమిషాలు వేరే లెవెల్.. పూనకాలు రావడం ఖాయం!!

అయితే ఈ మూవీ ని చూసిన ఉమైర్ సందు జాన్వి కపూర్ పాత్ర చాలా ఇరిటేటింగ్ గా ఉంది అంటూ ట్వీట్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా జాన్వీ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే ఉంటుందని, ఈమె సెకండాఫ్ లో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది.అలాగే సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ లా యాక్టింగ్ ఫెంటాస్టిక్ గా ఉంది అని ఎన్టీఆర్ క్రేజీ స్టంట్స్ అద్భుతంగా ఉన్నాయి అంటూ ట్వీట్ పెట్టారు ఉమైర్ సందు.

The first review of Devara movie

అయితే ఉమైర్ సందు రివ్యూ ను ఎవరు ఎక్కువగా పట్టించుకోక పోయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్ల రివ్యూలు పాజిటివ్ గా ఉండడంతో చాలామంది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క రివర్స్ స్క్రీన్ ప్లే ని అర్థం చేసుకుంటే సినిమా మొత్తం చాలా అమేజింగ్ గా ఉంటుందని అంటున్నారు.మరి చూడాలి ఇండియాలో దేవర సినిమాకి ఏమాత్రం టాక్ ఉంటుందో.(Devara)