యువరాజ్ సింగ్ వైరల్ వీడియో

Yuvraj Singh: యువరాజ్ సింగ్, క్రికెట్ మైదానంలో తన ప్రతిభతో అందరినీ అబ్బురపరిచినట్లే, తన ప్రైవేట్ లైఫ్‌తో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలిచేవాడు. ఆయన పలువురు బాలీవుడ్ నటీమణులతో ప్రేమాయణం నడిపించాడనే వార్తలు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారేవి. కిమ్ శర్మ, ప్రీతి జింగ్వానీ, దీపికా పదుకోణే వంటి అనేక నటీమణులతో యువరాజ్ సింగ్ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

Yuvraj Singh and His Famous Ex-Girlfriends Revealed

అయితే, ఈ వార్తలన్నీ ఎంత వరకు నిజమో తెలియదు. కానీ, యువరాజ్ సింగ్‌పై ఉన్న అమ్మాయిల క్రేజ్ అంతా ఇంతే అని అర్థమవుతుంది. కొంతమంది అభిమానులు యువరాజ్ సింగ్ తన ప్రేమ వ్యవహారాల వల్ల క్రికెట్‌పై శ్రద్ధ తగ్గించాడని అనుకునేవారు. అయితే, యువరాజ్ సింగ్ తన క్రికెట్ కెరీర్‌ను ఎంతో ప్రెస్టీజ్ గా తీసుకున్నాడు. తాజాగా, యువరాజ్ సింగ్ తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలిపారు.

Also Read: Devara: దేవర సినిమా విషయంలో భారీ మోసం.. అందుకే ఆ కఠిన నిర్ణయం!!

2007-08లో అడిలైడ్‌లో ఉన్నప్పుడు ఒక నటిని కలిసినట్లు చెప్పారు. ఆ నటిని తను కలవాలని అనుకోలేదని, కానీ ఇద్దరూ బస్సులో కలిసి అనుకోకుండా ప్రయాణించాల్సి వచ్చిందని అన్నాడు. ఆ సమయంలో క్రికెట్ లో తన ప్రదర్శన తక్కువగా ఉన్నందున ఆమెతో తనను వదిలిపోవాలని వేడుకున్నాను అని చెప్పనున్నాడు. అయితే, ఆ నటి ఎవరో ఆయన వెల్లడించలేదు.

యువరాజ్ సింగ్‌ యొక్క ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రతి ఒక్కరూ ఆ నటి ఎవరు అనేది ఊహించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, యువరాజ్ సింగ్ ఈ విషయంపై మరింత స్పష్టత ఇవ్వలేదు.