Devara Collections: సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ చిత్రం, చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌ అద్భుతమైన నటన, కొరటాల శివ దర్శకత్వం, అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. మొదటి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో అన్న ఉత్సాహం నెలకొంది.

Devara Devara Collections ₹125 Crore on Opening Day

ప్రీ రిలీజ్ బిజినెస్‌ మరియు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రికార్డులు చూసి, సినిమా భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ‘ట్రిపుల్‌ ఆర్‌’ వంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన ఈ చిత్రం మరోసారి బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతుందని అంచనా. ఇప్పటివరకు 15.27 లక్షల టిక్కెట్లు ప్రీసేల్స్‌లోనే అమ్ముడుపోవడం, సినిమా క్రేజ్‌ ఎంతలా ఉందో తెలియజేస్తోంది.

Also Read: Devara Review: ఎన్టీఆర్ ‘దేవర’మూవీ రివ్యూ!!

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, తొలి రోజు ‘దేవర’ రూ. 120 నుంచి 125 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఇది ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించే సినిమాగా నిలిచే ఛాన్స్‌ ఉంది. ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లు, ఇండియాలో రూ. 90 కోట్లు వసూలు చేసే అవకాశాలున్నాయి.

తొలిరోజు వసూళ్లలో ‘కల్కి’ మొదటి స్థానంలో ఉన్నా, ‘దేవర’ రెండో స్థానాన్ని అందుకునేలా కనిపిస్తోంది. వీకెండ్ కావడంతో పాటు, ఇతర పెద్ద సినిమాలు పోటీ లేకపోవడం వలన వసూళ్లు మరిం పెరగవచ్చని అంచనా. రాబోయే సెలవుల సీజన్‌ కూడా కలెక్షన్లను మరింత పెంచే అవకాశం ఉంది.