Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ అంశం మరోసారి ప్రధాన చర్చకు తెరలేపింది. దసరా పండుగ రాకముందే అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరులో రైతుల దీక్షలో పాల్గొన్న హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు.

Harish Rao Criticizes CM Revanth Reddy Over Farmer Promises

హరీష్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల రుణమాఫీ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తోంది అని తెలిపారు. దసరా పండుగ వచ్చేలోపు రుణమాఫీని అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

Also Read: Pawan Kalyan OG: తుతు మంత్రం గా సినిమాలు చేస్తున్న పవన్.. బ్యాంకాక్ సెట్ మంగళగిరి ఏంది సామీ!!

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు, అయితే ప్రస్తుత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ ఇచ్చడం కేసీఆర్‌ ప్రభుత్వ సఫలతగా పేర్కొంటూ, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధంగా రైతులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు.

మొత్తం మీద, తెలంగాణలో రైతుల రుణమాఫీ అంశం రాజకీయంగా ముఖ్యమైన అంశంగా మారింది. హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి