Devara Review and Rating

నటీనటులు: (Devara Review) ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు.
దర్శకుడు: కొరటాల శివ
నిర్మాత: మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్
సంగీతదర్శకుడు: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
విడుదల తేదీ: 27 సెప్టెంబర్ 2024

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ సినిమా, విడుదలైన క్షణం నుండి అందరినీ ఆకట్టుకుంటూ విస్తృతంగా చర్చనీయాంశమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, తొలి భాగంతోనే ప్రేక్షకులను అలరించగలిగింది. ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించడం, సున్నితమైన కథ, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కలిసి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులాలను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

NTR Devara Review and Rating Analysis

కథ : ఎర్ర సముద్రం ప్రాంతంలో నాలుగు ఊర్లు ఉంటాయి. దేవర (ఎన్టీఆర్) ఓ ఊరికి అండగా ఉంటాడు. మరో ఊరికి భైర (సైఫ్ అలీ ఖాన్) పెద్దగా ఉంటాడు. మిగిలిన రెండు గ్రామాల వారితో కలిసి దేవర, భైర సముద్రం పై వచ్చే షిప్ ల్లో దోపిడీ చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దేవరకి భైర బ్యాచ్ తో గొడవ జరుగుతుంది. అసలు దేవర దేనికి వారికి వ్యతిరేకంగా మారాడు?, దేవర ఎవరకి కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి?, ఈ మధ్యలో దేవర కొడుకు వర (యంగ్ ఎన్టీఆర్‌ పాత్ర) ఎందుకు భయపడుతూ ఉంటాడు?, వరతో తంగం (జాన్వీ కపూర్) ప్రేమ కథ ఎలా సాగింది?, చివరకు దేవర కథ ఎలా ముగిసింది ?, దేవర కోసం వర ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.

నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో అదరగొట్టాడు. ‘దేవర’లో అటు మరియు ఇటు రెండు పాత్రల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. జాన్వీ కపూర్ 20 నిమిషాలు మాత్రమే స్క్రీన్ మీద ఉండగా, సైఫ్ అలీ ఖాన్ పాత్ర కూడా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ తర్వాత ఈ పాత్రనే ఎక్కువగా గుర్తించారు. దేవర భార్యగా శృతి మరాఠే పాత్ర బాగుంది. మిగిలిన పాత్రల్లో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, అజయ్ కూడా మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు, అయితే గెటప్ శ్రీను కొన్ని సీన్స్ మాత్రమే కనిపించాడు.

సాంకేతిక విభాగం: అనిరుధ్ మ్యూజిక్ మిన్నంటించేశాడు. ఆయన రాసిన పాటలు అన్ని కచ్చితంగా చెక్కబడినట్టు అనిపించాయి. నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్, యాక్షన్ సీన్స్‌కు పవర్ ప్యాక్డ్ మ్యూజిక్ ఇచ్చాడు. చుట్టమల్లె సాంగ్‌ను వర ఫైట్ సమయంలో వాడడం అనిరుధ్ మార్క్‌ను చాటింది. రత్నవేల్ కెమెరాపనితనం కూడా అద్భుతంగా ఉంది.

శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌లో తన మార్క్ చూపించారు, ప్రొడక్షన్ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కొరటాల రాసిన మాటల్లో ఎమోషనల్ డెప్త్ ఉంది, బలమైన కథతో పాటు అభిమానులు ఇష్టపడేలా ఎన్టీఆర్‌ని ప్రజెంట్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యారు. మొత్తం మీద, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ‘దేవర’ సినిమా దసరాకు ముందుగానే మంచి వరం అనిపించింది.

విశ్లేషణ: విజువల్ పరంగా అద్భుతమైన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను అలరించింది. ఎన్టీఆర్ యొక్క పవర్‌ఫుల్ నటన, కొరటాల శివ దర్శకత్వం, అద్భుతమైన సాంకేతిక విభాగం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఫీల్ గుడ్ ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

అయితే, కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా సాగడం, లవ్ స్టోరీ పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటివి ఈ సినిమాలోని చిన్న చిన్న లోపాలుగా చెప్పవచ్చు. అయినప్పటికీ, ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో, డైలాగ్ డెలివరీతో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు.

సారాంశంగా చెప్పాలంటే, దేవర సినిమా ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే కాకుండా, సినిమా ప్రేమికులందరికీ నచ్చే చిత్రం. విజువల్ వండర్, పవర్‌ఫుల్ యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమాను మరచిపోలేని అనుభూతిని ఇస్తాయి.

ప్లస్ పాయింట్స్:

ఎన్టీఆర్ పవర్‌ఫుల్ నటన
కొరటాల శివ దర్శకత్వం
అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్
వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్
ఫీల్ గుడ్ ఎమోషన్స్

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ మెరుపులు తగ్గడం
కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం
లవ్ స్టోరీ ఆకట్టుకోకపోవడం

తీర్పు: ‘దేవర’ సినిమా ఒక పూర్తి యాక్షన్ చిత్రం. ఎన్టీఆర్ అభిమానులకు ఇది పండగే. సినిమా ప్రేమికులు కూడా ఈ సినిమాను ఆస్వాదించవచ్చు.

Rating: 2.5/5