NTR Fans Disappointed by Cutout Fire at Sudarshan Theater

Devara Cutout: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై, తారక్ అభిమానులను సంబరంతో నింపింది. సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు పండగలా జరుపుకున్నారు, తమ ప్రియ నటుడికి ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ నటనకు, సినిమా కథకు అభిమానులు ముక్తకంఠంతో ప్రశంసలు కురిపిస్తున్నారు.

NTR Fans Disappointed by Devara Cutout Fire at Sudarshan Theater

అయితే ఈ సందర్భంగా ఒక చిన్న అసౌకర్యకరమైన సంఘటన కూడా చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటౌట్ అనుకోకుండా అగ్నికి ఆహుతి అయింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా పూర్తిగా వెలుగు చూడలేదు, కానీ ఈ సంఘటన అభిమానుల ఉత్సాహాన్ని కొద్దిగా తగ్గించింది. చాలా మంది చెప్పడం మాత్రం కట్ అవుట్ వద్ద క్రాకర్స్ పేల్చడం తో వాటి వల్ల ప్రమాదం జరిగింది అంటున్నారు.

Also Read: Jagan Tirupati Trip: జగన్ ను తిరుపతి రానీయకుండా అడ్డుకునేందుకు పవన్ వ్యూహం.. జనసేన శ్రేణులతో చర్చలు!!

ఇంకొంతమంది వేరే హీరో ఫ్యాన్స్ వచ్చి కావాలనే నిప్పు పెట్టారని అంటున్నారు. ఇంకా కొందరు అయితే సినిమా ఫ్లాప్ టాక్ వచ్చే సరికి ఫ్రస్టేషన్ తో ఈ విధంగా చేశారంటున్న. ఏదేమైనా ప్రమాదం లో ఎవరికీ ఏం కాలేదు.. సినిమా విషయానికి వస్తే, ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన పోషించిన రెండు విభిన్న పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.

1996 వరల్డ్ కప్ నేపథ్యంలో కథ నడవడం కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పటివరకు, ‘దేవర’ చిత్రం ఎన్టీఆర్ అభిమానులకు పండగే. కటౌట్ దగ్ధం కావడం ఒక నిరాశ కలిగించినప్పటికీ, సినిమా సాధించిన విజయంతో అభిమానులు మరోసారి గర్వపడుతున్నారు.