Devara: ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలోని ‘దేవర’ సినిమా ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఐదేళ్ల గ్యాప్ తర్వాత తారక్ సోలోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. తారక్‌ మాస్ ఇమేజ్‌కు ఈ సినిమా మరోసారి బూస్ట్ ఇవ్వబోతుందని అభిమానులు భావిస్తున్నారు.

NTR’s “Devara” Expected to Break Opening Day Records

ఈ సినిమాకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. రిలీజ్‌కు ముందే బుకింగ్స్ బాగా నడుస్తుండటంతో, ‘దేవర’ తారక్ కెరీర్‌లోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా నిలవనుంది. ఫస్ట్ డే నుంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: Ram Charan Wishes NTR: రామ్ చరణ్ దేవర విషెష్ కొరటాల కు లేదా.. మంట ఇంకా చల్లారలేదా!!

సినీ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ‘దేవర’ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్క్‌ను అతిక్రమించే అవకాశం ఉంది. ఈ విజయంతో తారక్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనర్‌గా ‘దేవర’ నిలవనుంది. ఇక రెండో రోజు నుంచి సినిమా ఎలాంటి మాస్ రెస్పాన్స్ సాధిస్తుందో చూడాలి. ‘దేవర’ సినిమా ఎక్కడి నుంచి ఎలా రానుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింతగా పెరిగింది.

https://twitter.com/david_bro18/status/1839377798290620562