Bathukamma: తెలంగాణలో బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అక్టోబర్ రెండు నుంచి పదవ తేదీ వరకు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. పూలతో పండుగను జరుపుకునే సాంప్రదాయం కేవలం తెలంగాణలోనే ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. అలిగిన బతుకమ్మ ఒక్కరోజు మినహాయించి మిగతా ఎనిమిది రోజులు వైవిధ్యమైన నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. తీరొక్క పూలను అందంగా స్థూపం, గోపురం, శంఖం ఆకారంలో అమర్చి బతుకమ్మను తయారు చేస్తారు. Bathukamma

Bathukamma Festival Full Detailes

ప్రధానంగా తంగేడు పూలు, గునుగు, మందార, గుమ్మడి, చేమంతి, బంతి, అడవి, చామంతి, బీరపువ్వు, గోరింట పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురవడంతో ఎక్కడ చూసిన అడవి పూలు అందంగా విరబూసి కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క ఆడబిడ్డ భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పూజించేందుకు సిద్ధమవుతున్నారు. Bathukamma

  1. ఎంగిలిపూల బతుకమ్మ: మహాలయ అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకుంటారు. నువ్వులు, నూకలు, బియ్యం పిండి కలిపి నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు.
  2. అటుకుల బతుకమ్మ: అశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. సప్పిడి పప్పు, అటుకులు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
  3. ముద్దపప్పు బతుకమ్మ: మూడవరోజు ముద్ద బతుకమ్మను జరుపుకుంటారు. ముద్దపప్పు, బెల్లం, పాలతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

Also Read: Bjp Mla Raja singh: తిరుమలకు వస్తే…జగన్ ను చంపేస్తాం ?

  1. నానే బియ్యం బతుకమ్మ: నాలుగవ రోజున బతుకమ్మను తయారు చేసి నానేసిన బియ్యం, బెల్లం, పాలతో కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
  2. అట్ల బతుకమ్మ: 5వ రోజు బతుకమ్మను అలంకరించి అట్లు లేదా దోశతో నైవేద్యం అమ్మవారికి పెడతారు.
  3. అలిగిన బతుకమ్మ: అశ్వయుజ పంచమి రోజున అలిగిన బతుకమ్మ జరుపుకుంటారు. ఈరోజున నైవేద్యం సమర్పించరు.
  4. వేపకాయల బతుకమ్మ: ఏడవ రోజు బతుకమ్మను అలంకరించి బియ్యంపిండి బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు.
  5. వెన్న ముద్దల బతుకమ్మ: ఎనిమిదవ రోజు బతుకమ్మను తయారుచేసి నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
  6. సద్దుల బతుకమ్మ: అశ్వయుజ అష్టమి రోజు అదే రోజున దుర్గాష్టమిని కూడా జరుపుకుంటారు. ఈరోజు తీరోక్క ఫలహారాలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా పెరుగన్నం, లడ్డూలు తయారు చేసి నైవేద్యంగా పెడతారు. Bathukamma