Devara Smashes RRR: ఎన్టీఆర్ అభిమానులకు ‘దేవర’ చిత్రం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్టీఆర్, చాలా కాలం తర్వాత సోలో హీరోగా నటించిన ‘దేవర’ సినిమా అంచనాలను అందుకొని బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై, భారీ విజయాన్ని నమోదు చేసింది.

Fans Celebrate as Devara Smashes RRR Record in Nizam

తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ కళ్ళు చెదిరే ఓపెనింగ్స్‌ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా నైజాంలో ఈ చిత్రం రూ. 19.32 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 2 స్థానం దక్కించుకుంది. ఇంతకు ముందు ఈ రికార్డు ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్ఆర్ఆర్‌’ పేరిట ఉండేది. ‘దేవర’ ఆ రికార్డును అధిగమించడం ఎన్టీఆర్‌ అభిమానులకు విశేషంగా ఆనందాన్ని కలిగించింది.

Also Read: Vijay Deverakonda: ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక ఒక లెక్క.. రాయలసీమ కొత్త అల్లుడు

అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, జాన్వీ కపూర్‌ నటన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎన్టీఆర్‌ అద్భుతమైన నట, కొరటాల శివ‌ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపేలా చేశాయి.
మొత్తానికి, ‘దేవర’ ఎన్టీఆర్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచి, తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణంగా మారింది.