Jagan: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై మరోసారి వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై ఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై ఎస్ జగన్.. తన మతం గురించి మాట్లాడారు. నా మతం మానవత్వం..డిక్లరేషన్ లో రాసుకోండని సూచించారు. ఒక మాజీ ముఖ్యమంత్రినే మతం అడిగితె, దళితులని మీరు గుడి లోపలికి రానిస్తారా అని ప్రశ్నించారు. Jagan

Jagan Comments On tirumala declaration

సెక్యులర్ అనే పదానికి అర్ధం తెలుసా ? అని ప్రశ్నించారు. సీఎం గా పనిచేసిన వారి పరిస్థితి ఇలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటి అని నిలదీశారు జగన్‌. దళితులను గుళ్ళ లోకి వెళ్ళనిస్తరా అంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయం చేయటం దౌర్భాగ్యమని ఆందోళన వ్యక్తం చేశారు జగన్‌. హిందూ మతానికి రిప్రజెంటేశన్ అని చెబుతున్న బీజేపీని కూడా ఇదే అడుగుతున్నానని పేర్కొన్నారు. Jagan

Also Read: Jagan: జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలు.. తెరపైకి కొత్త రూల్ ?

ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తిరుమల ఆలయాం, లడ్డు పై అబద్ధాలు చెప్పారన్నారు. జంతువుల ఫ్యాట్ వాడక పోయినా వాడినట్టు అబద్ధం చెప్పినట్టు రుజువు అవుతున్న కూడా ఎందుకు చంద్రబాబును బీజేపీ మండలించకుండా వెనకేసుకు వస్తున్నారని ఆగ్రహించారు. నాన్న వైఎస్ ఐదేళ్ల పాటు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని… నేను ఆయన కొడుకునే కదా అని తెలిపారు. పాదయాత్ర కూడా అక్కడకు వెళ్లి బయల్దేరాను… పాదయాత్ర పూర్తయ్యాక తిరుమలకు కాలి నడకన వెళ్ళానని వివరించారు. Jagan