Nani: ‘బలగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును కట్టిపడేసిన దర్శకుడు వేణు ఎల్దండి, ఆ చిత్రం విజయానంతరం నటుడు నానితో కలిసి సినిమా చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఆసక్తి చూపి ‘యెల్లమ్మ’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. అయితే, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అయితే ఈ సినిమా ఎందుకు పట్టాలెక్కలేదో ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు.

Nani Chooses Srikanth Odela’s Over Venu Yeldandi

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నానికి మరో కథను వినిపించడంతో పరిస్థితి మారిపోయింది. నాని తన మాస్ ఇమేజ్‌ను పెంచుకోవాలని కోరుకున్న సమయంలో, శ్రీకాంత్ కథలో ఉన్న మాస్ ఎలిమెంట్స్ అతన్ని ఆకర్షించాయి. వేణు కథలో ఎమోషన్, నవల్టీ పాయింట్ ఉన్నప్పటికీ, తాత్కాలికంగా నాని ఈ ప్రాజెక్ట్‌ను వాయిదా వేశారు. తన నిర్ణయం గురించి నాని మాట్లాడుతూ, ముందుగా శ్రీకాంత్ ఓదెల కథను పూర్తి చేసిన తర్వాతే వేణు దర్శకత్వం వహించబోయే సినిమా గురించి ఆలోచిస్తానని చెప్పారు.

Also Read: Devara: ఎన్టీఆర్ కి రాజమౌళి శాపంలా తయారయ్యాడే.. సెంటిమెంట్ బ్రేక్ అవ్వలే!!

శ్రీకాంత్ కథలోని కమర్షియల్ అంశాలు తనకు మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెడతాయని నాని భావించాడు. అయితే, వేణు మాత్రం ఈ కలయికపై ఇంకా ఆశావహంగా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో, తాను నానితో కలిసి సినిమా చేస్తానని, ఆ ప్రాజెక్ట్ కోసం సరైన కథను వెతుకుతున్నట్లు చెప్పారు. నాని-వేణు కాంబినేషన్‌పై ప్రేక్షకుల ఆశలు ఇంకా నిలిచి ఉండగా, భవిష్యత్తులో ఈ ఇద్దరూ కలిసి మరో మంచి సినిమా ఇస్తారని నమ్మకంతో ఉన్నారు.