Savitri: తెలుగు సినీ చరిత్రలో సావిత్రి గారి పాత్ర చాలా ప్రత్యేకమైనది. ఆమె నటన, అందం, ప్రతిభ వెరసి ఎన్ని చిత్రాల ద్వారా ఆమె ప్రేక్షకులను మెప్పించారు. సాధారణ పాత్రలను కూడా ఆమె తన నటనతో విశేషంగా తీర్చిదిద్దేవారు, అందుకే ఆమెకు “మహానటి” అనే బిరుదు పొందింది.

Savitri Impact on Future Generations of Actresses

సావిత్రి గారు సినిమాను కేవలం వృత్తి చూడలేదు, అది ఆమె జీవితం. సినిమా సెట్లో ఉన్న ప్రతి అంశాన్ని ఆమె చాలా సీరియస్‌గా తీసుకునేవారు. రామవిజేత బ్యానర్‌లో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఆమె యువ నటి దీపను కలిసారు. దీప, తాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అవకాశాలున్నాయని చెప్పడంతో, సావిత్రి గారు, “భాష కాకుండా, పాత్ర ముఖ్యం” అని స్పష్టంగా చెప్పారు.

Also Read: Jayam Ravi Divorce: జయం రవి విడాకుల కేసు..జయం రవి మానసికంగా ఇబ్బందులు.. డాక్టర్ కేనీషా!!

తెలుగు, తమిళ సినిమాల్లో చీర కట్టుకునే విధానం మరియు హిందీ సినిమాల్లోనూ చీర కట్టుకునే విధానం గురించి ఆమె దీపకు వివరించారు. అదేవిధంగా, ఒక నటిగా ఎలా ఉండాలి, సెట్లో ఎలా ప్రవర్తించాలి అనే విషయాల గురించి కూడా సూచనలు ఇచ్చారు.

ఒక సందర్భంలో, దీప షూటింగ్‌కు ఆలస్యంగా రాగానే, సావిత్రి గారు ఆమెను తప్పుబట్టారు. సినిమా సెట్లో దురుసుగా ప్రవర్తించకూడదని, ఇతరుపై ప్రభావం చూపకుండా ఉండాలనే ముఖ్యమై విషయాలను ఆమె జ్ఞప్తి చేసుకున్నారు. సావిత్రి గారు తన జీవితంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు మరియు తదుపరి తరాల నటీమణులకు మంచి మార్గదర్శకంగా నిలిచారు. ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రతి నటుడికి స్ఫూర్తిగా ఉంటాయి.