Will wife prevent Jani Master from getting bail

Jani Master: ఏంటి జానీ మాస్టర్ కి బెయిల్ రాకుండా అడ్డుకుంటుంది కట్టుకున్న భార్యేనా.. ఈ విషయం తెలిస్తే మనం వినేది నిజమేనా అనుకుంటారు చాలామంది.అయితే ప్రస్తుతం ఈ వార్త తెలిస్తే జానీ మాస్టర్ భార్య కావాలనే బెయిల్ రాకుండా చేస్తుంది కావచ్చు అంటూ అనుకోక మానరు. ఎందుకంటే..తాజాగా జానీ మాస్టర్ భార్య చేసిన పని అలా ఉంది. ఇక విషయంలోకి వెళ్తే..నాలుగు రోజులు నార్సింగి పోలీసుల కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ ని ఈరోజు రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు.

Will wife prevent Jani Master from getting bail

అయితే పోలీసుల విచారణలో కొన్ని విషయాలు చెప్పి కొన్ని విషయాలు దాటవేసిన జానీ మాస్టర్ కి బెయిల్ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే జానీ మాస్టర్ భార్య సుమలత ఫిలిం ఛాంబర్ కామర్స్ కి ఓ ఫిర్యాదు చేసింది. ఇక ఆ ఫిర్యాదులో ఆ అమ్మాయి మా కుటుంబాన్ని ఐదు సంవత్సరాల నుండి వేధిస్తోంది. నా భర్తని ట్రాప్ చేసి మరీ రిలేషన్ పెట్టుకుంది. ఇక నేను ఆమె వల్ల సూసైడ్ చేసుకోవాలని చూసాను. నా పిల్లలకు నాకు ఏమైనా అయితే దానికి కారణం ఆమె, ఆమె తల్లే.. జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఆయన దగ్గర డబ్బులు బంగారం కొట్టేసింది.(Jani Master)

Also Read: Vishwak Sen: మార్కెట్ లేకున్నా గట్టి ప్రయత్నం చేస్తున్న విశ్వక్ సేన్!!

కానీ రివర్స్ లో మళ్ళీ అత్యాచారం చేశారంటూ ఆయనపై కేసు పెట్టింది.మీరే నాకు సహాయం చేయాలి అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే సడన్గా జానీ మాస్టర్ భార్య గొంతు మార్చేసింది.ఎందుకంటే ఇన్ని రోజుల వరకు నా భర్తకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఆమె అసిస్టెంట్ డైరెక్టర్గా నా భర్త దగ్గర పని చేసిందని,కానీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెప్పిన సుమలత సడన్గా నా భర్తతో రిలేషన్ పెట్టుకొని ఐదు సంవత్సరాల నుండి నరకం చూపిస్తుంది అని మాట మార్చడంతో పోలీసులు టర్న్ అయ్యి మళ్లీ ఆయనను కాస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉంటే ఎక్కడ తిరిగారు..

Will wife prevent Jani Master from getting bail

ఏం చేశారు.. ఇద్దరికీ ఇష్టమయ్యే డేటింగ్ చేశారా.. లేక జానీ మాస్టర్ బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశారా.. అనే కోణంలో ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తుంది.అలా బెయిల్ వస్తుంది అనుకున్న సమయంలో సుమలత చేసిన పనికి జానీ మాస్టర్ బెయిల్ క్యాన్సిల్ అయినట్టు మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో జానీ మాస్టర్ భార్య కావాలనే ఇలా చేస్తుందా అని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Jani Master)