Chiranjeevi did not listen to Balakrishna

Chiranjeevi: ఏంటి బాలకృష్ణ వద్దని చెప్పిన వినకుండా ఆ అమ్మాయిని తీసుకొని నిండా మునిగాడా.. ఇంతకీ చిరంజీవి చేసిన తప్పేంటి..బాలకృష్ణ చెప్పినా ఎందుకు వినలేదు అనేది ఇప్పుడు చూద్దాం.. రీసెంట్గా బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ ప్రస్తుతానికి సంబంధించి ఇండస్ట్రీ వాళ్ళు ఆయనను ఘనంగా సన్మానించారు. అయితే ఈ ఈవెంట్ కు ముందు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi did not listen to Balakrishna

ఇందులో భాగంగా శ్రీదేవితో మీరు ఎందుకు నటించలేదు అని అడగగా..మా సినిమాకి ఆ హీరోయిన్ సెట్ అవ్వలేదు అనిపించింది. అయితే నేను నా సినిమాకి ఒక హీరోయిన్ ని తీసుకుంటే ఖచ్చితంగా ఆ పాత్రకి సెట్ అయితేనే తీసుకుంటాను. అందుకే ఆ హీరోయిన్ నీ తీసుకోవాల్సిన పాత్ర నా సినిమాలో ఏదీ లేదు. అందుకే తీసుకోలేకపోయాము అని చెప్పారు. ఇక చిరంజీవి పేరు తీయకుండా నేను ఓ స్టార్ హీరోకి కూడా రీమేక్ సినిమాలో శ్రీదేవిని తీసుకోకండి సెట్ అవ్వదు ఆ పాత్రకి అని చెప్పాను.(Chiranjeevi)

Also Read: Balakrishna: వాడు నందమూరి వారసుడే కాదు.. ఎన్టీఆర్ పై బాలకృష్ణ కామెంట్స్ వైరల్.?

అయినా కూడా ఆ హీరో వినకుండా శ్రీదేవిని తీసుకున్నారు.కానీ తీరా సినిమా ఫ్లాఫ్ అయింది అంటూ పరోక్షంగా చిరంజీవిపై కామెంట్ చేశారు.అయితే చిరంజీవి గురించి బాలకృష్ణ ఈ కామెంట్ చేశారు అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే.. అప్పట్లో స్టార్ హీరోలుగా బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలు ఉన్నారు. ఇక నాగార్జున శ్రీదేవి కాంబో లో గోవింద గోవిందా, ఆఖరిపోరాటం వంటి రెండు సినిమాలు వచ్చి హీట్ అయ్యాయి.

Chiranjeevi did not listen to Balakrishna

అలాగే వెంకటేష్ తో క్షణక్షణం మూవీ కూడా హిట్ అయింది. ఇక చిరంజీవితో జగదేకవీరుడు అతిలోసుందరి హిట్ అయింది కానీ ఆ తర్వాత రీమేక్ గా వచ్చిన ఎస్పీ పరశురాం సినిమా ఫ్లాప్ అయింది అయితే ఆ సమయంలోనే చిరంజీవికి బాలకృష్ణ శ్రీదేవిని వద్దని చెప్పారని, కానీ చిరంజీవి వినలేదని దాంతో బాలకృష్ణ చెప్పినట్టే ఎస్పీ పరశురాం సినిమా అంతగా ఆడలేదని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.(Chiranjeevi)