Folk singer Mallik Teja Rasalilalu

Mallik Teja: ఈ మధ్యకాలంలో చాలామంది అత్యాచారానికి గురైన వాళ్ళు బయటికి వచ్చి ధైర్యంగా వారి పేర్లు చెబుతూ కేసులు పెడుతున్న సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. రీసెంట్ గా స్టార్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ పై ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ కేసు నమోదు చేసిన సంగతి మనకు తెలిసిందే. అలాగే ఫేమస్ యూట్యూబర్ అయినటు వంటి హర్ష సాయి మీద కూడా నటి,బిగ్బాస్ కంటెస్టెంట్ అయినటువంటి మిత్రావ్ శర్మ కేసు పెట్టింది.

Folk singer Mallik Teja Rasalilalu

అయితే తాజాగా వీరిలాగే మరో కేసు కూడా బయటపడింది.ఫోక్ సాంగ్స్ పాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మల్లిక్ తేజ పై తాజాగా జగిత్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.మల్లిక్ తేజ తనని అవకాశాలు ఇస్తానని వాడుకున్నారని, పలుసార్లు స్టూడియోలోని అత్యాచారం చేశారని, ఎన్నిసార్లు బెదిరించినా అలాగే చేస్తూ బయటికి చెబితే నీ ఫోటోలు, వీడియోలు బయటపెడతాను అంటూ బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు అంటూ మామిడి మౌనిక అనే ఫోక్ సింగర్ ఆయనపై కేసు నమోదు చేసింది. (Mallik Teja)

Also Read: Jani Master Case: జానీ మాస్టర్ పై తల్లి కూతుర్ల కుట్ర.. ఇది కొత్త కోణం బాసూ!!

అలాగే తరచూ ఫోన్ చేస్తూ తన ఫ్యామిలీని తనని దుర్భాషలాడుతూ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.అయితే మామిడి మౌనిక చాలాసార్లు మల్లిక్ తేజ గురించి పాజిటివ్గా మాట్లాడింది. తనకి లైఫ్ ఇచ్చింది ఆయనే అంటూ మామ అంటూ ఎంతో ప్రేమగా పిలిచేది .అయితే అలాంటి తేజ లోపల ఇలాంటి మానవమృగం ఉందా అని ఈ విషయం తెలిసిన చాలా మంది ఫైర్ అవుతున్నారు.

Folk singer Mallik Teja Rasalilalu

ఇక మామిడి మౌనిక మల్లిక్ తేజ ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో ఫోక్ సాంగ్స్ వచ్చాయి. వీరి కాంబో లో వచ్చిన ఫోక్ సాంగ్స్ ఎంతోమందిని ఆకర్షించాయి. అలా ఫేమస్ ఫోక్ సింగర్స్ గా పేరు తెచ్చుకున్న మల్లిక్ తేజ,మామిడి మౌనిక గురించి తాజాగా ఎన్నో వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Mallik Teja)