Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లుగా అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇరానీ కప్ కోసం కాన్పూర్ నుంచి లక్నోకు తన తండ్రి కమ్ కోచ్ నౌషాద్ ఖాన్ తో కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇక ఎంతో ప్రతిభావంతుడైన యంగ్ ప్లేయర్ ముషీర్ ఖాన్ ఇటీవల దులీప్ ట్రోఫీలో అద్భుతంగా ఆడిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. Musheer Khan

Musheer Khan likely out of Irani Cup after road accident in UP

ఇండియా-సీ జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు ఇండియా-ఏపై భారీ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ ప్రమాదం కారణంగా 19 ఏళ్ల ముషీర్ ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఇరానీ ట్రోఫీలో ఆడడం అనుమానంగా మారడం జరిగింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 1-5 మధ్య ఇరానీ కప్ మ్యాచ్ జరగనుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో ముంబై ఈ మ్యాచ్ ఆడబోతోంది. ముంబై జట్టులో ఉన్న ఈ యువ ఆల్ రౌండర్ ఇప్పుడు రంజీ ప్రారంభ మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. ప్రమాదంలో అతని మెడపై తీవ్రంగా గాయమైనట్లుగా తెలుస్తోంది. Musheer Khan

Also Read: New Ration Card: కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం.. హైడ్రా ను డైవర్ట్ చేయడానికా?

దీంతో అతడు మూడు నెలల పాటు ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. ఇక అక్టోబర్ లో ఇండియా-ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించబోతోంది. ఈ పర్యటనలో భారత యువ జట్టు రెండు మ్యాచ్లు ఆడనుంది. ఈ పర్యటనకు దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్ మ్యాచ్ ఆధారంగా ఇండియా-ఏ జట్టు ఎంపిక ఉండబోతోంది. దీంతో దులీప్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ముషీర్ ఇరానీ మ్యాచ్లో కూడా రాణించి ఇండియా-ఏ జట్టులో చోటు సంపాదించాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ ప్రమాదం కారణంగా మొదటికే మోసం వచ్చినట్లు అయింది .Musheer Khan