Simbu Relation with star heroine

Simbu: తమిళ హీరోలుగా ఫేమస్ అయిన వారిలో రజినీకాంత్,కమల్ హాసన్, విశాల్,విజయ్, అజిత్,శివ కార్తికేయన్, సూర్య, కార్తీ వంటి హీరోలలో నటుడు శింబు కూడా ఒకరు. అయితే ఈయన సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్లతో నడిపించిన అఫైర్ల కారణంగానే ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయారు. ఇక శింబుతో ఏ హీరోయిన్ నటించినా కూడా ఆయన ప్రేమలో పడేస్తారు అని, ఆయన డేటింగ్ చేస్తారు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది.

Simbu Relation with star heroine

అలా ఇప్పటికే నయనతార, హన్సిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లతో శింబు డేటింగ్ చేసినట్టు డేటింగ్ రూమర్స్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.అయితే తాజాగా ఓ డేటింగ్ చేసిన హీరోయిన్ తో శింబు త్వరలోనే పెళ్లికి రెడీ అవ్వబోతున్నట్టు తమిళ మీడియా లో పుకార్లు వైరల్ అవుతున్నాయి.అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వార్త హాట్ టాపిక్ గా మారడంతో శింబు పెళ్లి వార్తలు మళ్లీ వైరల్ గా మారాయి.(Simbu)

Also Read: Hero: పిల్లల కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో.. లేకుంటే విడాకులే.. స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్.?

అయితే ఇప్పటికే చాలా సార్లు శింబు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించినప్పటికీ అది జరగలేదు. ఇక గత కొద్ది రోజుల ముందు అయితే శ్రీలంక అమ్మాయితో శింబు పెళ్లి ఫిక్స్ అని దాదాపు ఖరారు అయినట్టే వార్తలు వినిపించాయి. కానీ చివరికి అది పుకారేనని బయటపడింది. అయితే తాజాగా నిధి అగర్వాల్ తో శింబు పెళ్లి వార్తలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి.

Simbu Relation with star heroine

చాలా రోజుల నుండి వీరి పెళ్లి వార్తలు ఆగిపోయినప్పటికీ మళ్లీ ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్లు ఊపందుకున్నాయి. గత కొద్ది రోజులుగా నిధి అగర్వాల్, శింబులు ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారని, అయితే ఏజ్ మీద పడడంతో ఇరుకుటుంబ సభ్యులు పెళ్లికి ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.(Simbu)