Star heroine shocking comments on Mahesh Babu

Mahesh Babu: టాలీవుడ్ లో అందగాడు ఎవరు అనగానే అందరికీ మహేష్ బాబు పేరే గుర్తుకొస్తుంది.. మిల్కీ బాయ్ గా టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడుగా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ అయినటువంటి రాజమౌళితో పాన్ వరల్డ్ లో ఓ సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా వేగంగా జరుగుతుంది.

Star heroine shocking comments on Mahesh Babu

ఇక వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమా షూటింగ్ ఉండబోతున్నట్టు సమాచారం. అయితే అలాంటి అందగాన్ని పట్టుకొని ఓ స్టార్ హీరోయిన్ మహేష్ బాబు మోహం మాత్రమే అందంగా ఉంటుంది.. కానీ అది మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది అని షాకింగ్ కామెంట్లు చేసింది. మరి మహేష్ బాబుని అలా అవమానించిన హీరోయిన్ ఎవరు.. అనేది చూస్తే ఆమె ఎవరో కాదు.. మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా చేసిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ..(Mahesh Babu)

Also Read: Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ ని అవమానించిన బిగ్ బీ ఫ్యామిలీ.. సీనియర్ నటి వార్నింగ్.?

మహేష్ బాబు కి సంబంధించి కియారా అద్వానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ . మహేష్ బాబు చాలా అందంగా ఉంటారు. కానీ ఆయన డబ్బింగ్ వాయిస్ మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది.అయితే నేను మొదటిసారి ఆయన డబ్బింగ్ చెప్పినప్పుడు విని ఈయనేంటి చూస్తే అందంగా ఉంటాడు వాయిస్ మాత్రం దరిద్రంగా ఉంది అనుకున్నాను.కానీ ఆ తర్వాత స్వయంగా కలిసి మాట్లాడితే కానీ అర్థం అవ్వలేదు.

Star heroine shocking comments on Mahesh Babu

డబ్బింగ్ లో అలా వినిపించినప్పటికీ బయట స్వయంగా కలిస్తే మాత్రం ఆయన వాయిస్ బాగుంది అనిపించింది అంటూ కియారా అద్వానీ చెప్పింది. ఇక కియారా అద్వానీ మాటలకు మహేష్ బాబు నవ్వుకొని డబ్బింగ్ చిత్రాల్లో నా వాయిస్ నాకే నచ్చదు. చిత్ర విచిత్రంగా ఉంటుంది. నా వాయిస్ గురించి మాట్లాడితే నాకే నవ్వొస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.(Mahesh Babu)