IPL 2025: ఐపీఎల్ లో ఆటగాళ్ల నిలకడ కోసం న్యూ రూల్స్ తీసుకొస్తోంది బీసీసీఐ పాలక మండలి. అందులో భాగంగా ఐపీఎల్ ను ఆటగాళ్లు సీరియస్ గా తీసుకోవడానికి ఓ కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. మొత్తం ఐపీఎల్ అంతా ఆటగాళ్లు ఆడితే ఒక్కో మ్యాచ్ ఫీజుతో పాటు ఒక్కో మ్యాచ్ కు 7 లక్షల రూపాయలు అదనంగా ఆటగాళ్లకు ఆదాయం అందనుంది. కానీ ఐపీఎల్ అంతా ఆడాలి అనే రూల్ పెట్టారు. IPL 2025

Ipl 2025 Retention Rules New Auction Purse

ఫలితంగా ఐపీఎల్ సీజన్ మొత్తం ఆడగలిగే ఆటగాడు వారికి వేలంలో దక్కిన కాంట్రాక్ట్ డబ్బులను కాకుండా కోటి ఐదు లక్షలను అదనంగా పొందుతారు. చాలామంది విదేశీ ఆటగాళ్లు 4 లేదా 5 మ్యాచులు ఆడడం, ఐపిఎల్ ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతుండడంతో ఫ్రాంచైజీలు కీలక మ్యాచులలో తీవ్రంగా నష్టపోతున్నారు. దానిని నివారించడానికి బీసీసీఐ ఈ కొత్త ఆఫర్ ను ప్రకటించింది. IPL 2025

Also Read: Musheer Khan: యువ సంచలనం ముషీర్ ఖాన్‌కు రోడ్డు ప్రమాదం..

దీనివల్ల యువ ఆటగాళ్లు లాభపడడమే కాకుండా విదేశీ ఆటగాళ్లు సీరియస్ గా ఆటను ఆడే అవకాశాలు ఉంటాయని బీసీసీఐ అభిప్రాయపడుతోంది. కాగా ఐపీఎల్‌ 2025 కోసం రిటెన్షన్‌ ప్రక్రియను ప్రకటించింది బీసీసీఐ. ఈ రూల్‌ ప్రకారం.. 5 ప్లేయర్లను రిటైన్‌ చేసుకోవచ్చు. అలాగే.. ఆర్టీఎం రూల్‌ కింద ఒకరితో తీసుకోవచ్చును. అంటే ఈ సారి 6 గురు ప్లేయర్లను రిటైన్‌ చేసుకోవచ్చు. IPL 2025