Malavika Mohanan Shocking Revelation About Prabhas Cooking

Malavika Mohanan: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మాళవికా మోహనన్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘తంగలాన్‌’, ‘రాజా సాబ్‌’, ‘సర్దార్‌ 2’ వంటి చిత్రాల్లో నటిస్తున్న ఈ అందాల తార, ఇటీవల తన సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో చర్చించింది. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సరదాగా, ఆసక్తికరంగా మాళవికా సమాధానాలు ఇచ్చింది.

Malavika Mohanan Shocking Revelation About Prabhas Cooking

ఒక ఫ్యాన్‌ “హైదరాబాద్‌లో తినడానికి మీకు ఏమి బాగా నచ్చింది?” అని అడగగా, మాళవికా, “హైదరాబాద్‌లో నేను తిన్న రుచికరమైన ఆహారం ప్రభాస్‌ పంపిన ఇంటి భోజనం” అని చెప్పింది. ఈ సమాధానం ఫ్యాన్స్‌కు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా ఒక ఫ్యాన్‌ “మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి?” అని అడగగా, మాళవికా, “అమ్మ వండే బ్రౌన్ రైస్‌, చేపల కూర, వేపుడు చాలా ఇష్టం” అని జవాబిచ్చింది.

Also Read: Janhvi Kapoor: దేవర లాంటి మరో ఫ్లాప్ సినిమా పడితే జాన్వీ కెరీర్ అంతే ఇక!!

మరో ఫ్యాన్‌ “హారర్‌ సినిమాలో దెయ్యం పాత్రలో నటిస్తే బాగుంటుంది” అని చెప్పగా, “మీరు నన్ను దెయ్యంలా ఎందుకు చూడాలనుకుంటున్నారు?” అని నవ్వుతూ ప్రశ్నించేసింది. సామాన్యంగా సోషల్ మీడియాలో మాళవికా మోహనన్‌ ఫ్యాన్స్‌తో ఇలా చర్చించడం చాలా అరుదు. కానీ, ఈసారి ఆమె ఇచ్చిన సమాధానాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇలానే ఆమె తన భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో నటిస్తూ, ప్రేక్షకులను మరింతగా అలరించాలనే ఆశాభావం అభిమానుల్లో ఉంది.