Nani Next Projects: తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాల బడ్జెట్‌ లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సినిమా బడ్జెట్‌ను ప్రధానంగా హీరో, దర్శకుడు, కథ వంటి అంశాలు నిర్ణయిస్తాయి. కొన్నిసార్లు హీరో మార్కెట్‌ స్థాయి కంటే ఎక్కువ ఖర్చు పెట్టినా, కథకు తగ్గట్టు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను స్వాగతిస్తారు. లేనిపక్షంలో, నిర్మాతలు తీవ్ర నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

Nani Next Projects in Trouble After ‘Saripodhaa Sanivaaram’ Fails

తాజాగా, నాని తన తర్వాతి చిత్రంలో బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ చేయాలనే ఆలోచన లేకుండా ఉన్నట్లు సమాచారం. ‘దసరా’ సినిమాతో విజయాన్ని సాధించిన శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ పరంగా ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని నాని నిర్మాతలకు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది.

Also Read: Vishwambhara: మెగా స్టార్ విశ్వంభర సంక్రాంతికి రావట్లేదా.. ఆ ఒత్తిడి వల్లే!!

ఈ సినిమాలో నాని మాస్‌ ఎలిమెంట్స్‌తో కూడిన ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నాడు. ‘దసరా’ కంటే పూర్తి భిన్నమైన నేపథ్యంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కథకు తగిన అనుభవాన్ని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో నాని, శ్రీకాంత్‌ ఓదెల కష్టపడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నాని, శైలేష్‌ కొలను దర్శకత్వంలో ‘హిట్‌ 3’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అర్జున్‌ సర్కార్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నాని కనిపించనున్నాడు, ఈ సినిమా పై కూడా భారీ అంచనాలను ఉన్నాయి.

ఇటీవలే అయన నటించిన సరిపోదా శనివారం విడుదలై పెద్ద విజయాన్ని సాధించలేదు. దీంతో అయన చేయబోయే సినిమాలపై ఆ ప్రభావం పడింది. నాని మార్కెట్ పైన కూడా పడింది. అందుకే దానయ్య, సుజిత్ సినిమా ఆగిపోయింది. అందుకే చిన్న బడ్జెట్ అయిన హిట్ 3 ని మొదలుపెట్టాడు. ఆ సినిమా మంచి వసూళ్లు సాధిస్తే శ్రీకాంత్ సినిమా కి మంచి బడ్జెట్ వస్తుంది లేదంటే అది కూడా ఆగిపోతుందేమో చూడాలి.