Tirumala Ghee Adulteration: తిరుమలలో లడ్డూల తయారీలో నెయ్యి కల్తీ ఆరోపణలపై జరుగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మార్కెటింగ్ గోడౌన్‌లో ఉన్న రికార్డులను సిట్ బృందం జాగ్రత్తగా పరిశీలించింది.

SIT Report on Tirumala Ghee Adulteration Case

దర్యాప్తులో భాగంగా, రెండు ట్యాంకర్ల నుండి నెయ్యి నమూనాలను సేకరించి, వాటిని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా, లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యత స్పష్టతగా తెలియనుంది. నెయ్యి పరీక్షల ప్రక్రియలో లోపాలేమైనా ఉన్నాయా, ఈ విషయంలో తగిన నియంత్రణలున్నాయా అనే అంశాలపై సిట్ బృందం ప్రత్యేక దృష్టి సారించింది.

Also Read: Digital Family Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రాజెక్టు ప్రారంభం!!

తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే విధానం ఎంత సరిగ్గా అమలవుతోందో తెలుసుకునేందుకు, సిట్ బృందం విస్తృత దర్యాప్తు చేపడుతోంది. దీనితో, లడ్డూల తయారీలో నెయ్యి కల్తీ ఆరోపణలపై సిట్ బృందం సమగ్రమైన సమాచారం సేకరించనుంది. ఈ విచారణ ద్వారా బయటపడే నిజాలు భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించే అవకాశముంది.

భక్తుల నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం టీటీడీ అధికారులు పూర్తిగా సహకరించాలని భక్తులు కోరుతున్నారు. సిట్ బృందం ఈ కేసులో తుది నివేదికను త్వరలోనే సమర్పించే అవకాశం ఉంది, ఇది లడ్డూల తయారీ విధానం పట్ల ప్రజలకు మరింత అవగాహన కలిగిస్తుందని భావిస్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ అంశం ఎంతో కీలకంగా మారిందో భక్తుల నమ్మకం విషయంలో కూడా అంతే కీలకంగా ఉంది.