Kolikapudi Srinivas: తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించేందుకు నిరవధిక దీక్షకు దిగారు. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని నిరూపించే వరకు దీక్ష విరమించబోనని ఆయన స్పష్టం చేశారు.

TDP MLA Kolikapudi Srinivas Denies Sexual Harassment Allegations

“నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్దము. ఎలాంటి ఆధారాలు లేకుండా నాకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఒక రాజకీయ కుట్ర, నాపై బురద జల్లడమే లక్ష్యంగా కొందరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు,” అని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: World Record: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ టీం కి దక్కని ఘనత సాధించిన టీం ఇండియా!!

“ఈ ఆరోపణలకు ఆధారాలు ఉంటే, వాటిని పోలీసులకు అందజేసి నాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నా నిజాయితీని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అయితే, ఆరోపణలు నిరూపించలేకపోతే నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని చెప్పారు.

కొలికపూడి శ్రీనివాస్ చేపట్టిన దీక్షకు ఆయన అనుచరులు మద్దతు ప్రకటిస్తున్నారు. వారు కూడా ఆరోపణలు నిరాధారమైనవని వాదిస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.