Thandel: నాగచైతన్య కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ ‘తండేల్’. ఈ చిత్రంలో ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం చైతన్య బాడీ లాంగ్వేజ్, స్లాంగ్‌ను మార్చుకోవడం ఆయనలోని విభిన్నమైన నటన చూడొచ్చు అంటున్నారు. దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీర్చిదిద్దుతున్నారు. సినిమా నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడుతూ, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మేకర్స్ అన్ని వనరులు సమకూర్చుతున్నారు.

Thandel Features Shivaratri Festival in Stunning Visuals

ఈ కథలో శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయానికి కీలక పాత్ర ఉంది. ఈ ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా తెరపై ఆవిష్కరించడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు.

Also Read: Tollywood: పెద్ద సినిమాలు లేకుండానే దసరా సీజన్.. టాలీవుడ్ ఉపయోగించుకోలేదా!!

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన శివరాత్రి పాటను భారీ సెట్‌లో, వేలాది మంది డాన్సర్స్ తో చిత్రీకరించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి కలిసి శివతాండవం చేస్తూ కనిపించే సన్నివేశాలు ఇప్పటికే విడుదలయ్యాయి, అందుకు ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరుగుతోంది.