Kantara Prequel: రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన “కాంతార” సినిమా సృష్టించిన సంచలనం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ చిత్రం సాధించిన ఘన విజయం తర్వాత, ప్రేక్షకుల కోరిక మేరకు ప్రీక్వెల్ రూపొందించబడుతోందన్న విషయం తెలిసిందే. “కాంతార చాప్టర్ 1” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mohan Lal Joins Rishab Shetty in the Kantara Prequel

సుమారు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రీక్వెల్‌లో మునుపటి కథకు ముందు ఏం జరిగిందన్నది ప్రేక్షకులకు తెలియజేయనున్నారు. రిషబ్ శెట్టితో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. మోహన్ లాల్, రిషబ్ శెట్టికి తండ్రిగా కనిపించబోతున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే కీలక సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: Heroine: కూతురుకి పెళ్లి చేయాల్సిన ఏజ్లో 4 పెళ్లికి రెడీ అయిన హీరోయిన్.?

“కాంతార” చిత్రం సాధించిన విజయంతో, “కాంతార చాప్టర్ 1″పై ప్రేక్షకుల్లో మరింత ఉత్సుకత నెలకొంది. ఈ సినిమా ప్రేక్షకులకు మునుపటి తరహా వినోదం అందిస్తుందని, కథలో మరిన్ని మలుపులు ఉంటాయని అనుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

“కాంతార” భారతీయ సినీ పరిశ్రమకు ఒక మైలురాయి ప్రాతీయ చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చింది. “కాంతార చాప్టర్ 1” కూడా ఆ స్థాయిలో నిలుస్తుందని, మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తుందని ఆశిద్దాం.